Lava O3 Pro: బడ్జెట్ ధరలో ఆల్ రౌండ్ ఫీచర్స్ కొత్త ఫోన్ లాంచ్ చేసిన లావా.!
లావా ఈరోజు మార్కెట్లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది
Lava O3 Pro ను బడ్జెట్ ధరలో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి వచ్చింది
Lava O3 Pro: ప్రముఖ ఇండియన్ మొబైల్ తయారీ కంపెనీ లావా ఈరోజు మార్కెట్లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను పెద్ద స్క్రీన్, బడ్జెట్ ప్రోసెసర్, స్లీక్ డిజైన్ మరియు పెద్ద బ్యాటరీ వంటి అన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చేసినట్లు లావా తెలిపింది. బడ్జెట్ ధరలో లావా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.
SurveyLava O3 Pro: ధర
లావా O3 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 6,999 రూపాయల ధరతో సింగల్ వేరియంట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను అమెజాన్ నుంచి రిలీజ్ చేసింది. అలాగే, అమెజాన్ నుంచి ఈ ఫోన్ ను ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియా నుంచి లిస్ట్ అయ్యింది.
Lava O3 Pro: ఫీచర్స్
లావా O3 ప్రో స్మార్ట్ ఫోన్ ను రౌండ్ కార్నర్స్ మరియు స్లీక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో 6.56 ఇంచ్ HD+ స్క్రీన్ వుంది మరియు ఇది సెంటర్ పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ లావా కొత్త ఫోన్ Unisoc T606 ఆక్టాకోర్ ప్రోసెసర్ శక్తితో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 4GB ర్యామ్, 4GB ఎక్స్ పాండబుల్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

లావా O3 ప్రో స్మార్ట్ ఫోన్ లో వెనుక 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ కెమెరా వైబ్రాంట్ ఫోటోలు మరియు 1080p వీడియోలు అందిస్తుందని లావా తెలిపింది. ఈ లావా కొత్త ఫోన్ 10W ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Human Washing Machine: మనిషిని శుభ్రం చేసే వాషింగ్ మిషన్ ను ఆవిష్కరించిన జపాన్ కంపెనీ.!
ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ సపోర్ట్ కూస్తో ఉన్నాయి. ఈ లావా ఫోన్ చాలా స్టైలిష్ లుక్స్ లో గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పల్ మరియు గ్లాసీ వైట్ మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile