కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం లాంచ్ చేసిన Sony: ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

సోనీ ఈ కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం ను లాంచ్ చేసింది

ఈ కొత్త స్పీకర్ సిస్టం ను 4.1 ఛానల్ కాన్ఫిగరేషన్ తో అందించింది

ఇందులో పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ను అందించింది

కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం లాంచ్ చేసిన Sony: ప్రైస్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!

సోనీ ఇండియా ఈరోజు కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం ను లాంచ్ చేసింది. ఈ కొత్త స్పీకర్ సిస్టం ను 4.1 ఛానల్ కాన్ఫిగరేషన్ తో అందించింది మరియు ఇందులో పవర్ ఫుల్ BASS అందించే సబ్ ఉఫర్ ను అందించింది. ఈ కొత్త సోనీ హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం ధర మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Sony హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం : ధర

సోనీ ఈ కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం ను SA-D40M2 మోడల్ నెంబర్ తో లాంచ్ చేసింది మరియు ఈ స్పీకర్ సిస్టం ను రూ. 9,999 ధరతో విడుదల చేసింది. ఈ హోమ్ థియేటర్ సిస్టం ను ఈరోజు నుంచి సేల్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది. ఈ సోనీ స్పీకర్ సిస్టం ను Sony Centers, సోనీ ఆథరైజ్డ్ డీలర్స్, Amazon, Flipkart మరియు అన్ని ప్రధాన ఎలక్ట్రానిక్ షాప్స్ లో లభిస్తుందని సోనీ తెలిపింది.

Also Read: iPhone 16 Series, వాచ్ 10 సిరీస్ మరియు ఎయిర్ పోడ్స్ 4 ఇండియా ప్రైస్ ఎంతో తెలుసా.!

Sony SA-D40M2 : ఫీచర్స్

సోనీ కొత్త హోమ్ థియేటర్ స్పీకర్ సిస్టం 4.1 ఛానల్ కాన్ఫిగరేషన్ తో వచ్చింది. ఇందులో పెద్ద సబ్ ఉఫర్ మరియు నాలుగు శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి. ఈ సిస్టం టోటల్ 100W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇది స్టీరియో మినీ జాక్, బ్లూటూత్ మరియు USB కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈ సౌండ్ సిస్టం BASS Reflex తో గొప్ప సౌండ్ అందిస్తుంది మరియు ఈ సూపర్ బాస్ సౌండ్ అందిస్తుంది.

Sony SA-D40M2

ఈ సౌండ్ సిస్టం మెటల్ గ్రిల్స్ కలిగిన స్పీకర్ లతో వస్తుంది మరియు పటిష్టమైన బిల్డ్ క్వాలిటీ కలిగిన ఉఫర్ తో కూడా వస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ చాలా గొప్పగా ఉంటుంది మరియు ఇది గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo