Realme Buds T200: చవక ధరలో LDAC సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

Realme Buds T200 కొత్త బడ్స్ విడుదల చేసింది

ఈ కొత్త ఇయర్ బడ్స్ ని చాలా చవక ధరలో LDAC సపోర్ట్ తో లాంచ్ చేసింది

ఈ కొత్త ఇయర్ బడ్స్ ని సరికొత్త కలర్ వేరియంట్స్ లో కూడా అందించింది

Realme Buds T200: చవక ధరలో LDAC సపోర్ట్ తో లాంచ్ అయ్యింది.!

Realme Buds T200 : రియల్ మీ ఈరోజు నిర్వహించిన అతిపెద్ద ఈవెంట్ నుంచి రియల్ మీ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు కొత్త బడ్స్ కూడా విడుదల చేసింది. ఈ కొత్త ఇయర్ బడ్స్ ని చాలా చవక ధరలో LDAC సపోర్ట్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ కొత్త ఇయర్ బడ్స్ ని సరికొత్త కలర్ వేరియంట్స్ లో కూడా అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme Buds T200 : ప్రైస్

రియల్ మీ లేటెస్ట్ ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 1,999 ధరలో రిలీజ్ చేసింది. ఈ బడ్స్ నియాన్ గ్రీన్, డ్రీమీ పర్పల్ మరియు మిస్టిక్ గ్రే మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ బడ్స్ ఈ మూడు కొత్త రంగుల్లో చాలా అందంగా కనిపిస్తాయి. ఈ బడ్స్ ఆగస్టు 1 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది.

Realme Buds T200 : ఫీచర్లు

రియల్ మీ కొత్తగా విడుదల చేసినటువంటి బడ్స్ టి200 గొప్ప సౌండ్ అందించే ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ బడ్స్ Hi-Res Audio Wireless మరియు LDAC సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఇది గొప్ప హై రిజల్యూషన్ సౌండ్ అందిస్తుంది. ఈ ఫీచర్ తో గొప్ప సౌండ్ అందించడానికి వీలుగా ఇందులో 12.4mm స్పీకర్ లను కూడా అందించింది. ఇది పవర్ ఫుల్ బాస్ మరియు బ్యాలెన్స్డ్ సౌండ్ అందిస్తుందని రియల్ మీ తెలిపింది.

Realme Buds T200

ఈ కొత్త ఇయర్ బడ్స్ వెలుపల శబ్దాలు చెవులకు చేరకుండా నిలువరించే 32dB యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ క్వాడ్ మైక్ నోయిస్ క్యాన్సిలేషన్ తో గొప్ప కాలింగ్ ఆఫర్ చేస్తుందని కూడా రియల్ మీ పేర్కొంది. 3D స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ మరియు డైనమిక్ ఆడియో సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ బడ్స్ టోటల్ 50 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. అదే ANC ఉంటే 35 గంటల ప్లే బ్యాక్, LDAC మరియు ANC ఆన్ లో ఉంటే 20 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది.

Also Read: Realme 15 Pro 5G: ట్రిపుల్ 50MP 4K కెమెరాలు మరియు లేటెస్ట్ చిప్ సెట్ తో వచ్చింది.!

ఈ ఇయర్ బడ్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కేవలం 10 నిముషాల ఛార్జ్ తో 5 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది. ఈ బడ్స్ ప్రీమియం మరియు గట్టి బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ బడ్స్ IP55 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఇందులో డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు అల్ట్రా లో లెటెన్సీ మోడ్ కూడా ఉన్నాయి. ఈ బడ్స్ లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 కనెక్టివిటీ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo