Realme 15 Pro 5G: ట్రిపుల్ 50MP 4K కెమెరాలు మరియు లేటెస్ట్ చిప్ సెట్ తో వచ్చింది.!
రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది
ఏకంగా మూడు 50MP 4K కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ నేటి తరానికి తగిన అన్ని ఫిచర్లు కలిగి ఉంటుంది
Realme 15 Pro 5G: రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది. ఈ రియల్ మీ లేటెస్ట్ 15 సిరీస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఏకంగా మూడు 50MP 4K కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ లేటెస్ట్ చిప్ సెట్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ నేటి తరానికి తగిన అన్ని ఫిచర్లు కలిగి ఉంటుంది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పూర్తి సమాచారం ఇక్కడ అందించాము.
SurveyRealme 15 Pro 5G: ధర
రియల్ మీ ఈ ఫోన్ ను నాలుగు వేరియంట్స్ లో రిలీజ్ చేసింది. ఈ నాలుగు వేరియంట్ ధరలు క్రింద చూడవచ్చు.
రియల్ మీ 15 ప్రో (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ : ధర రూ. 31,999
రియల్ మీ 15 ప్రో (8 జీబీ + 256 జీబీ) వేరియంట్ : ధర రూ. 33,999
రియల్ మీ 15 ప్రో (12 జీబీ + 256 జీబీ) వేరియంట్ : ధర రూ. 35,999
రియల్ మీ 15 ప్రో (12 జీబీ + 512 జీబీ) వేరియంట్ : ధర రూ. 38,999
ఈ ఫోన్ ను ఫ్లోయింగ్ సిల్వర్, వెల్వెట్ గ్రీన్ మరియు సిల్క్ పర్పల్ మూడు రంగుల్లో అందించింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్స్ ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్ మరియు రియల్ మీ అఫీషియల్ సేల్ నుంచి ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులో ఉంది మరియు సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుంది.
ఆఫర్లు :
ఈ ఫోన్ పై రియల్ మీ భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించింది. ఒకటి రూ. 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్. రెండోది క్రెడిట్ కార్డ్ EMIపై రూ. 3,000 రూపాయల డిస్కౌంట్ ఆఫర్. మూడోది రూ. 6,000 రూపాయల భారీ ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్. అయితే, ఈ మూడు ఆఫర్స్ లో ఏదైనా ఒక్కటి మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది.
Also Read: Realme 15 5G: డ్యూయల్ 50MP 4K కెమెరాతో సర్ప్రైజ్ ధరలో లాంచ్ అయ్యింది.!
Realme 15 Pro 5G: ఫీచర్లు
రియల్ మీ 15 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 4nm పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 7 Gen 4 తో అందించింది. దీనికి తోడు ఈ ఫోన్ లో 12GB ఫిజికల్ ర్యామ్, 14GB డైనమిక్ ర్యామ్ మరియు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది. ఈ రియల్ మీ ఫోన్ 6.8 ఇంచ్ క్వాడ్ 4D కర్వ్ ప్లస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 1.5K రిజల్యూషన్ మరియు 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా జతగా మూడవ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 60FPS 4K వీడియో, 4K సినిమాటిక్ వీడియో మరియు AI ఎడిట్ జీని వంటి గొప్ప కెమెరా ఫిచర్లు కలిగి ఉంటుంది. ఈ రియల్ మీ ఫోన్ 7000mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ కలిగిన సెగ్మెంట్ స్లిమ్మెస్ట్ ఫోన్ గా ఇది నిలుస్తుంది. ఈ ఫోన్ కేవలం 7.69mm మందంతో చాలా సన్నగా మరియు 187 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది.