Realme P4 Lite: పెద్ద బ్యాటరీతో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న రియల్‌మీ.!
రీసెంట్ గా పి4 సిరీస్ నుంచి లైట్ ఫోన్ ను కూడా అనౌన్స్ చేసింది
Realme P4 Lite లైట్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ గా లాంచ్ చేస్తోంది
కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ కూడా రియల్‌మీ బయటకు వెల్లడించింది
Realme P4 Lite: రీసెంట్ గా పి4 సిరీస్ నుంచి 10,001 mAh బిగ్ బ్యాటరీతో పి4 పవర్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ, ఇప్పుడు ఇదే సిరీస్ లైట్ ఫోన్ ను కూడా అనౌన్స్ చేసింది. అదే రియల్‌మీ పి4 సిరీస్ నుంచి లైట్ వెర్షన్ స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను కూడా భారీ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్స్ మరియు స్పెక్స్ కూడా రియల్‌మీ బయటకు వెల్లడించింది.
SurveyRealme P4 Lite: లాంచ్ డేట్?
రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తునట్లు డేట్ మరియు టైం అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కోసం ఫ్లిప్ కార్ట్ నుంచి ప్రత్యేకమైన టీజర్ పేజీ తో టీజింగ్ చేస్తోంది, ఈ పీజీ నుంచి ఈ ప కమింగ్ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా వెల్లడించింది.
Realme P4 Lite: ఫీచర్స్
రియల్‌మీ పి4 లైట్ స్మార్ట్ ఫోన్ 7.94mm స్లీక్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కూడా 6300mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ మిలటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్, IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ మరియు స్పీకర్ క్లీనర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.74ఇంచ్ పెద్ద HD స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది 563 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు వాటర్ పడినా కూడా పని చేసే స్మార్ట్ టచ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ మీడియాటెక్ Helio G99 చిప్ సెట్ తో లాంచ్ అవుతోంది. ఇది వేగవంతమైన బడ్జెట్ 4జి చిప్ సెట్ గా నిలిచిన చిప్ సెట్. అంతేకాదు, ఈ ఫోన్ లో టోటల్ 18 జీబీ వరకు డైనమిక్ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్ 13MP ప్రైమరీ కెమెరా జతగా డెప్త్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ లో AI కెమెరా ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో మంచి కాలింగ్ కోసం తెలివైన AI నోయిస్ ఫిల్టర్ ఫీచర్ కూడా ఉంది.
Also Read: OPPO K14x 5G: భారీ ఆఫర్స్ తో మొదలైన ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ సేల్.!
ఈ ఫోన్ 15W ఫేసర్ ఛార్జ్ మరియు 6W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 300% హెవీ ఆడియో ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ రియల్‌మీ లేటెస్ట్ UI పై ఆండ్రాయిడ్ 15 OS తో లాంచ్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile