JBL Dolby Soundbar ఇప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం 5 వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో లభిస్తుంది. దీపావళి పండుగ ముందు ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్ నుంచి ఈ సౌండ్ బార్ డీల్ ను అనౌన్స్ చేసింది. చవక ధరలో జేబీఎల్ వంటి బడా బ్రాండ్ యొక్క డాల్బీ సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ సౌండ్ బార్ డీల్ ను పరిశీలించవచ్చు.
Survey
✅ Thank you for completing the survey!
JBL Dolby Soundbar: డీల్
జేబీఎల్ యొక్క డాల్బీ సౌండ్ బార్ Cinema SB241 2.1 పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 56% భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ Rs. 6,499 ధరకు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి ఈరోజు లిస్ట్ అయ్యింది. ఇది కాకుండా ఈ సౌండ్ బార్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,850 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది.
ఈ జేబీఎల్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 110 W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో రెండు స్పీకర్లు కలిగిన బార్ ఉంటుంది మరియు డీప్ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా ఉంటుంది. ఇది మెటల్ గ్రిల్ మరియు గ్లాసీ ఫినిష్ తో వచ్చే ప్రీమియం డిజైన్ కలిగిన సౌండ్ బార్ మరియు బడ్జెట్ ధరలో మీ టివికి తగిన జోడీగా ఉంటుంది.
సౌండ్ పరంగా, ఈ జేబీఎల్ సౌండ్ బార్ డాల్బీ ఆడియో టెక్నాలజీ తో వస్తుంది. మంచి సినిమాటిక్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇందులో మ్యూజిక్, మూవీ, న్యూస్ అండ్ వాయిస్ అనే ప్రీ సెట్ ఈక్వలైజర్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ HDMI Arc, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ సౌండ్ బార్ బెడ్ రూమ్ మరియు లివింగ్ రూమ్ కి సరిపోతుంది. ఇది డీసెంట్ అండ్ డీప్ బాస్ సౌండ్ తో ఆకట్టుకుంటుంది. ఈ జేబీఎల్ 2.1 ఛానల్ సౌండ్ బార్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రీజనబుల్ ప్రైస్ లో అందుకోవచ్చు.