అతి తక్కువ ధరలో స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ విడుదల చేసిన Boat

HIGHLIGHTS

యూత్ ని టార్గెట్ చేసుకుని ఒక సరికొత్త బ్లూటూత్ హెడ్ సెట్ ను ఇండియాలో విడుదల చేసింది.

ఇది ఒక 40mm డ్రైవ్ తో వస్తుంది కాబట్టి అబ్బురపరిచే బాస్ ని మీకు అందిస్తుంది.

అతి తక్కువ ధరలో స్టైలిష్ మరియు పవర్ ఫుల్ బ్లూటూత్ హెడ్ ఫోన్ విడుదల చేసిన Boat

ఆడియో డివైజెస్ అందించే మంచి సంస్థగా అందరి నుండి ప్రశంసలు అందుకున్న బోట్ సంస్థ, ఇప్పుడు యూత్ ని టార్గెట్ చేసుకుని ఒక సరికొత్త బ్లూటూత్ హెడ్ సెట్ ను ఇండియాలో విడుదల చేసింది. ముందుగా, ఇండియాలో లాంచ్ అయినవెంటనే మంచి ప్రజాధారణ పొందినటువంటి, Bass Heads 900 కు తరువాతి తరం హెడ్ సెట్ గా ఈ Bass Heads 950 ను విడుదల చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ హెడ్ ఫోన్ను డ్యూయల్ టోన్ ఫినిష్, బోట్ సిగ్నేచర్ సౌండ్ ,మరియు ఒక మైక్ తో అందించింది. ఈ హెడా ఫోన్ యొక్క ధరను రూ. 1,299 గా ప్రకటించింది. దీని గురించి బోట్ కో- ఫౌండర్ అయినటువంటి, అమన్ గుప్తా మాట్లాడుతూ, " ఈ Bass Heads 950 బ్లూటూత్ హెడ్ ఫోన్ తన స్టైలిష్ డిజైన్ మరియు సౌండ్ తో అలరిస్తుంది. ఎందుకంటే, ఇది స్థిరమైన మెటీరియల్ మరియు బ్లాక్ మరియు సిల్వర్ రంగుల సంకలనంతో వస్తుంది కాబట్టి, అందరిని ఆకట్టుకుంటుంది". అని తెలిపారు.

ఇక ఈ హెడ్ ఫోన్ ప్రత్యేకతలు విషయానికి వస్తే, ఇది ఒక 40mm డ్రైవ్ తో వస్తుంది కాబట్టి అబ్బురపరిచే బాస్ ని మీకు అందిస్తుంది. అలాగే ఇందులో అందించిన ప్యాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ మరియు పర్ఫెక్ట్ సౌండ్ ఐసో లేషన్ తో ప్రతి చిన్న సౌండ్ ని మీకు క్షుణ్ణంగా వినిపిస్తుంది. ఇక ఇది అమెజాన్ ఇండియా నుండి అమ్ముడవుతుంది మరియు ఇది 1 సంవత్సరం వారెంటీతో వస్తుంది కాబట్టి, డ్యూరబిలిటీ విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరంలేదు.                               

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo