HIGHLIGHTS
బ్లూపంక్ట్ తన లేటెస్ట్ నెక్‌బ్యాండ్ ను ఇండియాలో ఆవిష్కరించింది
ఈ నెక్‌బ్యాండ్ Blaupunkt BE100 పేరుతో లాంచ్
ఈ నెక్‌బ్యాండ్ టోటల్ 100 గంటల ప్లేటైమ్ అందించగలదు
ప్రముఖ జర్మన్ ఆడియో కంపెనీ బ్లూపంక్ట్ తన లేటెస్ట్ నెక్‌బ్యాండ్ ను ఇండియాలో ఆవిష్కరించింది. ఈ నెక్‌బ్యాండ్ Blaupunkt BE100 పేరుతో లాంచ్ చెయ్యబడింది. ఈ వైర్లెస్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ అమెజాన్ మరియు కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా సేల్ కి అందుబాటులో వుంది. ఈ నెక్‌బ్యాండ్ టోటల్ 100 గంటల ప్లేటైమ్ అందించగలదు. అంతేకాదు, కాల్ వచ్చినప్పుడు మీకు తెలిసేలా వైబ్రేషన్ కాల్ అలర్ట్ ఫీచర్ తో వస్తుంది. బ్లూపంక్ట్ తీసుకొచ్చిన ఈ కొత్త వైర్లెస్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ యొక్క వివరాలు మరియు రేటు గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
SurveyBlaupunkt BE100 నెక్‌బ్యాండ్ ను రూ. 1,299 రూపాయల ధరలో విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ ఇప్పటికే Amazon మరియు Blaupunkt యొక్క స్వంత వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అయితే, అమెజాన్ నుండి Prime Day Launch అఫర్ లో భాగంగా కేవలం రూ.999 రూపాయలకే అఫర్ చేస్తోంది. ఈ నెక్‌బ్యాండ్ బ్లాక్ మరియు బ్లూ రెండు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. Buy From Here
ఈ బ్లూపంక్ట్ BE100 వైర్లెస్ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ పవర్ ఫుల్ 10mm స్పీకర్లను కలిగి ఉంది. దీని ద్వారా ఇది థంపింగ్ BASS తో క్రిస్పీ మరియు క్లియర్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఇది పూర్తి ఛార్జింగ్ పైన 100 గంటల ప్లేబ్యాక్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఎందుకంటే, ఇది 600 mAh యొక్క భారీ బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది మరియు వేగంగా ఛార్జ్ చెయ్యగల TurboVolt ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ నెక్‌బ్యాండ్ కేవలం 10 నిమిషాల ఛార్జింగ్ తో 10 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.