అమెజాన్ అప్ కమింగ్ సేల్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదలు కావడానికి ముందే గొప్ప ఆఫర్స్ ప్రకటించడం మొదలుపెట్టింది. ఇందుకు ఉదాహరణగా ఈరోజు ప్రకటించిన బెస్ట్ సౌండ్ బార్ డీల్ గురించి చెప్పవచ్చు. బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన boAt Dolby Soundbar పై భారీ డిస్కౌంట్ అందించి కేవలం 5 వేల రూపాయల బడ్జెట్ ధరలో సేల్ ఆఫర్ చేస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా boAt Dolby Soundbar డీల్?
బోట్ లేటెస్ట్ గా విడుదల చేసిన డాల్బీ సౌండ్ బార్ Aavante 2.1 1600D సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా రూ. 7,999 ప్రైస్ ట్యాగ్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది. అయితే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 1,500 భారీ డిస్కౌంట్ అందుకుని రూ. 6,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ని సౌత్ ఇండియన్ బ్యాంక్ డెబిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 5,999 రూపాయల ధరలోనే లభిస్తుంది. Buy From Here
ఈ బోట్ సౌండ్ బార్ 2.1 ఛానల్ సౌండ్ సెటప్ తో వస్తుంది. ఇది స్లీక్ అండ్ ప్రీమియం డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ బటన్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ బోట్ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ మరియు బార్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 160W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇందులో AUX, USB, ఆప్టికల్, HDMI (ARC) మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఇక సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ పరంగా చూస్తే, ఈ సౌండ్ బార్ డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇందులో మ్యూజిక్, మూవీస్, న్యూస్ మరియు 3D నాలుగు ఈక్వలైజర్ మోడ్స్ కూడా బోట్ అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ నుంచి అందిస్తున్న అన్ని ఆఫర్స్ తో కలిపి దాదాపు రూ. 2,000 రూపాయల తగ్గింపు ధరలో లభిస్తుంది.