Amazon GFF Sale నుండి చవక ధరలో లభించే వెరైటీ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఇవే.!

HIGHLIGHTS

Amazon GFF Sale ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది

ఈరోజు కొన్ని వెరైటీ బ్లూటూత్ స్పీకర్లు చాలా చవక ధరలో లభిస్తున్నాయి

ఇంట్లో డెకరేషన్ కోసం కూడా ఈ బ్లూటూత్ స్పీకర్లు పరిశీలించవచ్చు

Amazon GFF Sale నుండి చవక ధరలో లభించే వెరైటీ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఇవే.!

Amazon GFF Sale ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. జూలై 31వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ సేల్ వారం రోజులు అందుబాటులో ఉంది. ఈ రోజుతో ముగియనున్న సేల్ నుంచి ఈరోజు కొన్ని వెరైటీ బ్లూటూత్ స్పీకర్లు చాలా చవక ధరలో లభిస్తున్నాయి. రాఖీ పండుగ సందర్భంగా మీరు మీ తోబుట్టువు కోసం లేదా ఇంట్లో డెకరేషన్ కోసం కూడా ఈ బ్లూటూత్ స్పీకర్లు పరిశీలించవచ్చు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Amazon GFF Sale : వెరైటీ స్పీకర్ డీల్స్

బ్లూటూత్ స్పీకర్ డీల్స్ అనకుండా వెరైటీ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ అని ఎందుకు అంటున్నారు? అని మీకు డౌట్ రావచ్చు. వెరైటీ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ అని ఎందుకు అన్నారంటే, ఈ బ్లూటూత్ స్పీకర్లు చూడటానికి విలక్షణంగా కనిపిస్తాయి. ఈ స్పీకర్ లు సరికొత్త వెరైటీ డిజైన్ తో మీమీ ఇంటి అలంకరణలో కూడా బాగా కనిపిస్తాయి. ఈ వెరైటీ బ్లూటూత్ స్పీకర్ డీల్స్ ఇప్పుడు చూద్దాం.

Zebronics County

ఇది చూడటానికి చిన్న సైజు బ్యాగ్ మాదిరిగా కనిపిస్తుంది మరియు టేబుల్ మంచి అలంకరణగా ఉంటుంది. ఈ స్పీకర్ అమేజ్ సేల్ నుంచి ఈరోజు కేవలం రూ. 449 ధరలో లభిస్తుంది. ఇది 3W సౌండ్ అందిస్తుంది మరియు USB, SD Card, FM మరియు బ్లూటూత్ కాల్ ఫంక్షన్ తో కూడా వస్తుంది. కాల్స్ మరియు మ్యూజిక్ వినడానికి ఇది సరిపోతుంది. Buy From Here

Amazon GFF Sale

Artis BT12 Classic Retro

ఈ బ్లూటూత్ పాతకాలం గ్రామ్ ఫోన్ మాదిరిగా డిజైన్ చెయ్యబడింది మరియు మీ ఇంటి డెకరేషన్ లో మంచి భాగం అవుతుంది. ఈ స్పీకర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 48% డిస్కౌంట్ తో రూ. 1,299 ధరలో లభిస్తుంది. ఇది 5W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ తో వస్తుంది మరియు FM, USB, AUX మరియు బ్లూటూత్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. Buy From Here

Also Read: 7000 mAh బిగ్ బ్యాటరీతో బడ్జెట్ ఫోన్ లాంచ్ చేస్తున్న Poco

ZEBRONICS Sound Feast 75

జెబ్రోనిక్స్ యొక్క ఈ బ్లూటూత్ స్పీకర్ ఈరోజు అమెజాన్ సేల్ నుంచి 67% డిస్కౌంట్ తో రూ. 1,199 ధరలో లభిస్తుంది. ఈ స్పీకర్ పారదర్శకమైన డిజైన్ తో మీ ఇంటికి గొప్ప డెకరేషన్ ఐటమ్ గా ఉంటుంది మరియు గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్పీకర్ డ్యూయల్ స్పీకర్లు కలిగి 14 W సౌండ్ అందిస్తుంది. ఈ స్పీకర్ బ్లూటూత్ వెర్షన్ 5.3, TWS, AUX, టైప్ C ఛార్జ్ పోర్ట్ మరియు 10 గంటల ప్లే బ్యాక్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo