Instagram Data Leak: 1.75 కోట్ల అకౌంట్స్ వ్యక్తిగత డేటా లీక్ .. పూర్తి వివరాలు తెలుసుకోండి.!
ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని పెద్ద లీక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది
కోట్లాది మంది ఉపయోగిస్తున్న ‘ఇన్‌స్టాగ్రామ్’ నుంచి అతిపెద్ద డేటా లీక్ ఇప్పుడు బయటపడింది
ఈ రిపోర్ట్ ద్వారా 1.75 కోట్ల అకౌంట్స్ వ్యక్తిగత డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది
Instagram Data Leak: ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని పెద్ద లీక్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ‘ఇన్‌స్టాగ్రామ్’ నుంచి అతిపెద్ద డేటా లీక్ ఇప్పుడు బయటపడింది. ఈ డేటా లీక్ గురించి సైబర్ సెక్యూరిటీ న్యూస్ (CSN) రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్ ద్వారా 1.75 కోట్ల అకౌంట్స్ వ్యక్తిగత డేటా లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ అతిపెద్ద డేటా లీక్ న్యూస్ క్లియర్ గా తెలుసుకుందాం.
SurveyInstagram Data Leak: ఏమిటి ఈ లీక్?
1.75 కోట్ల ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు సంబంచిన పర్సనల్ డేటా డార్క్ వెబ్ ఫోరమ్‌లలో అమ్మకానికి పెట్టబడింది. ఇది ఇన్‌స్టాగ్రామ్ చరిత్రలో అతిపెద్ద లీక్ గా నిలుస్తుంది మరియు ఈ లీక్ యూజర్ల వ్యక్తిగత డేటా కలిగి ఉండటం చాలా సున్నితమైన విషయంగా ఉంటుంది. అయితే, ఈ డేటా సేకరణ లేదా లీక్ హ్యాకింగ్ ద్వారా కాకుండా, డేటా స్క్రాపింగ్ లేదా API మిస్ యూజ్ లేదా థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా సేకరించిన సమాచారంగా చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నారంటే, ఇన్‌స్టాగ్రామ్ సర్వర్లు నేరుగా హ్యాక్ అయినట్లు స్పష్టమైన ఆధారాలు లేవు.
లీక్ అయిన డేటా లో ఏమున్నాయి?
ఇక లీకైన డేటా కలిగిన సున్నితమైన డేటా విషయానికి వస్తే, ఇందులో యూజర్ కి సంబంధించిన చాలా పర్సనల్ డేటా ఉంది. ఇందులో, యూజర్ పేరు, ఇమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, లొకేషన్ డిటేల్స్ మరియు ఇతర పర్సనల్ డేటా ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ప్రైవేట్ చాట్ మరియు పాస్వర్డ్ లాంటివి లీక్ కాలేదని ప్రస్తుతానికి సమాచారం. యూజర్లకు ఇది కొంత ఊరటనిచ్చే విషయం అవుతుంది. అయితే ఈ డేటా లీక్ న్యూస్ పై మెటా పూర్తి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Also Read: టాప్ రేటెడ్ Samsung 5.1 Dolby సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!
ఈ డేటా లీక్ వల్ల యూజర్ కి వచ్చే సమస్య ఏమిటి?
ఈ డేటా లీక్ వలన యూజర్ కి కొన్ని ప్రమాదాలు లేదా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో, ఫిషింగ్ ఇమెయిల్స్ మరియు ఫేక్ లాగిన్ లింక్స్ ముఖ్యంగా ఉంటాయి. అంతేకాదు, ఫేక్ పాస్వర్డ్ రీసెట్ మెసేజ్, స్కామ్ కాల్స్, స్పామ్ వాట్సాప్ మెసేజెస్ మరియు ఐడెంటిటీ ఫ్రాడ్ వంటి సమస్యలు యూజర్ కు ఎదురయ్యే సమస్యలు గా ఉంటాయి.
యూజర్ వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు?
మీ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే మీరు వెంటనే కొన్ని సేఫ్టీ టిప్స్ లేదా ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. ముందుగా మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పాస్వర్డ్ ను మార్చండి. యూనిక్ మరియు స్ట్రాంగ్ పాస్వర్డ్ ను ఉపయోగించండి. ఇప్పటికే ఇతర సైట్లలో వాడిన అదే పాస్‌వర్డ్ ను రిపీట్ చేయకపోవడం మంచిది. మీ అకౌంట్ కు Two-Factor Authentication (2FA) ఆన్ చేయండి. మీరు మీరు రిక్వెస్ట్ చేయకుండా వచ్చే Reset Emails పై క్లిక్ చేయవద్దు. అలాగే, మీ ఫోన్ లో అవసరం లేని ఇన్‌స్టాగ్రామ్ కనెక్టెడ్ యాప్స్ రిమూవ్ చేయడం కూడా మంచిది.
లేటెస్ట్ గా జరిగిన ఇన్‌స్టాగ్రామ్ డేటా లీక్, మరోసారి డిజిటల్ సెక్యూరిటీ ఎంత ముఖ్యమో మనకు గుర్తు చేస్తోంది.