టాప్ రేటెడ్ Samsung 5.1 Dolby సౌండ్ బార్ మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది.!
టాప్ రేటెడ్ Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఒకటి ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది
ఈ సౌండ్ బార్ ను శాంసంగ్ ఇటీవల లేటెస్ట్ గా విడుదల చేసింది
ఈ సౌండ్ బార్ డాల్బీ మరియు DTS రెండు సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది
టాప్ రేటెడ్ Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఒకటి ఈరోజు మంచి డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఈ సౌండ్ బార్ ను శాంసంగ్ ఇటీవల లేటెస్ట్ గా విడుదల చేసింది. ఈ సౌండ్ బార్ డాల్బీ మరియు DTS రెండు సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈరోజు ఈ సౌండ్ బార్ పై లభిస్తున్న ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను రీజనబుల్ ధరలో మీరు పొందవచ్చు. ఈ సాంబార్ బడ్జెట్ ప్రైస్ లో సినిమా థియేటర్ వంటి జబర్దస్త్ సౌండ్ మీకు అందిస్తుంది.
SurveySamsung 5.1 Dolby సౌండ్ బార్ : ఆఫర్స్
శాంసంగ్ 5.1 ఛానల్ డాల్బీ మరియు డిటిఎస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో ఇటీవల విడుదల చేసిన సౌండ్ బార్ మోడల్ నెంబర్ HW-B67EF/XL, ఈరోజు రీజనబుల్ ప్రైస్ లో లభిస్తుంది. ఎందుకంటే, ఫ్లిప్ కార్డ్ ఈరోజు ఈ శాంసంగ్ సౌండ్ బార్ పై 39% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ అందుకున్న ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 23,990 ఆఫర్ ధరకే లిస్ట్ అయ్యింది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాకుండా ఈ సౌండ్ బార్ పై అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. అదేమిటంటే, HDFC మరియు BOB CARD EMI క్రెడిట్ కార్డ్ తో ఈ సౌండ్ బార్ తీసుకుంటే రూ. 1,500 అదనపు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 22,490 రూపాయల ఆఫర్ ధరలో మీకు లభిస్తుంది.
Also Read: సేల్ కంటే ముందే Samsung Galaxy A55 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!
Samsung 5.1 Dolby సౌండ్ బార్ : ఫీచర్స్
ఈ శాంసంగ్ సౌండ్ బార్ 5.1 ఛానల్ సెటప్ కలిగి ఉంటుంది మరియు టోటల్ 490W పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఇందులో మూడు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ వైర్లెస్ సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ పరిపూర్ణ థియేటర్ ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాదు, ఇందులో సినిమాలు, వీడియోలు, మ్యూజిక్‌లో స్పష్టంగా మాటలు, ఎఫెక్ట్స్ మీరు స్పష్టంగా అనుభవించవచ్చు.
ఈ సౌండ్ బార్ డాల్బీ డిజిటల్, డాల్బీ ఆడియో మరియు DTS Virtual-X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ వంటి అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ సౌండ్ బార్ కలిగిన ఫీచర్స్ తో మంచి థియేటర్ వంటి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో, HDMI Arc, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి.
ఈ శాంసంగ్ సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.6 హై రేటింగ్ అందుకుంది మరియు గొప్ప రివ్యూలు కూడా సొంతం చేసుకుంది.