నేషనల్ సెక్యూరిటీ కి భంగం వాటిల్లే విధంగా చైనా మూలాధారం కలిగిన 119 Apps Ban బ్యాన్ చేయడం పై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నివేదిక చూస్తుంటే, 2020 తర్వాత మరోసారి భారత ప్రభుత్వం చైనా యాప్స్ పై ధ్వజమెత్తబోతోంది అని క్లియర్ గా అర్థం అవుతోంది. 2020 లో కూడా Tik Tok, Shein తో సహా చాలా యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వబోతున్నట్లు కనిపిస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
119 China Apps Ban
చైనా మరియు హాంగ్ కాంగ్ డెవలపర్స్ తో లింక్ కలిగిన యాప్స్ ను బ్యాన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా వీడియో మరియు వాయిస్ చాట్ యాప్స్ ప్రధానంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. IT Act సెక్షన్ 69A ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా చెబుతున్నారు.
ఈ కొత్త నిర్ణయంతో చైనా తో మూలాధారం కలిగిన 119 యాప్స్ ను బ్యాన్ చేయబోతోంది. ఇందులో 15 యాప్స్ ని ఇప్పటికే బ్యాన్ చేసినట్లు కూడా వెల్లడించారు. అయితే, మిగిలిన యాప్స్ ఇప్పటికీ డౌన్ లోడ్స్ కోసం అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని యాప్స్ సింగపూర్, US, UK మరియు ఆస్ట్రేలియా కి చెందినవి కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇవి చైనా యాప్స్ కంటే ఎక్కువగా రూల్స్ బ్రేక్ చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు.
అయితే, ఇప్పటికే బ్యాన్ అయిన యాప్ డెవలపర్లు అధికారుల నుంచి పారదర్శక లోపం ఉందని వాపోతున్నారు. 1ఓ లక్షలకు పైగా డౌన్ లోడ్స్ దాటిన సింగపూర్ బేస్డ్ యాప్ ChillChat బ్యాన్ గురించి గూగుల్ నోటిఫికేషన్ అందుకున్నట్లు డెవలపర్లు చెబుతూ, ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది మాత్రమే కాదు మరిన్ని యాప్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, ఈ గూగుల్ యొక్క డిస్ క్లోజర్ లుమెన్ నుంచి తొలగించబడింది మరియు ఇప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ టైమ్ లైన్ పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇందంతా చూస్తుంటే, ఈ యాప్స్ ను ఎప్పటి వరకు బ్లాక్ లేదా బ్యాన్ చేసే అవకాశం ఉంటుందో క్లారిటీ లేకుండా పోయింది.