ఊరటనిస్తున్న బంగారం ధర..ఈరోజు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

ఊరటనిస్తున్న బంగారం ధర..ఈరోజు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!
HIGHLIGHTS

గత కొంత కాలంగా భారీ పెరుగుదలను నమోదు చేస్తున్న బంగారం ధర

బంగారం ధర గత వారాంతం నుండి కొంచెం ఊరటనిస్తోంది

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి

గత కొంత కాలంగా భారీ పెరుగుదలను నమోదు చేస్తున్న బంగారం ధర గత వారాంతం నుండి కొంచెం ఊరటనిస్తోంది. వారాంతంలో గోల్డ్ మార్కెట్ కుదుపులకి గురై భారీ నష్టాలను చూసింది. మొత్తంగా ఈ నెల ప్రారంభంలో పెరిగిన గోల్డ్ రేట్, మళ్ళి అంతే నష్టాలను చవిచూసి యధాస్థానానికి చేరుకుంది. అందుకే, ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.       

Gold Live:

గత గురువారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 53,600 రూపాయలుగా ఉండగా, శుక్రవారం మరియు శనివారం గోల్డ్ మార్కెట్ 1200 రూపాయల నష్టాన్ని చవిచూసి రూ.52,400 రూపాయల చేరుకోగా ఈరోజు 250 రూపాయలు పెరిగి రూ.52,650 వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,160 నుండి 280 రూపాయలు పెరిగి రూ.57,440 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత రెండు రోజుల్లో గోల్డ్ రేట్ దారుణంగా పడిపోయింది మరియు ఈరోజు స్వల్పంగా పెరిగింది.   

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,590 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,530 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo