Boult Bass Box: చవక ధరలో రెండు కొత్త సౌండ్ బార్స్ లాంఛ్ చేసిన బోల్ట్.!

Boult Bass Box: చవక ధరలో రెండు కొత్త సౌండ్ బార్స్ లాంఛ్ చేసిన బోల్ట్.!
HIGHLIGHTS

Boult కంపెనీ ఇప్పుడు రెండు కొత్త సౌండ్ బార్ లను విడుదల చేసింది

కొత్త సౌండ్ బార్ లను ఆకర్షణీయమైన ధర మరియు ఫీచర్స్ తో లాంఛ్ చేసింది

బోల్ట్ ఇప్పుడు హోమ్ ఆడియో కేటగిరిని కూడా జత చేసింది

Boult Bass Box: ప్రముఖ ఆడియో ప్రోడక్ట్స్ బ్రాండ్ గా పరిచయం ఉన్న బోల్ట్ కంపెనీ, ఇప్పుడు రెండు కొత్త సౌండ్ బార్ లను విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్ లో ఇప్పటికే నెక్ బ్యాండ్, TWS బడ్స్, హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్ లను అందించిన బోల్ట్, ఇప్పుడు హోమ్ ఆడియో కేటగిరిని కూడా జత చేసింది. అంతేకాదు, హోమ్ ఆడియో కేటగిరి నుండి రెండు కొత్త సౌండ్ బార్ లను ఆకర్షణీయమైన ధర మరియు ఫీచర్స్ తో లాంఛ్ కూడా చేసింది.

Boult Bass Box

బోల్ట్ బ్రాండ్ కొత్తగా హోమ్ ఆడియో కేటగిరి నుండి BassBox X120 మరియు BassBox X120 సౌండ్ బార్ లను లాంఛ్ చేసింది. ఈ రెండు సౌండ్ బార్స్ వాటి పేరు సూచించినట్లుగా వరుసగా 120W మరియు 180W సౌండ్ అవుట్ పుట్ తో వస్తాయి. ఈ సౌండ్ బార్ ధరల వివరాలను క్రింద చూడవచ్చు.

Boult BassBox X120 సౌండ్ బార్ ధర : రూ. 4,999

Boult BassBox X180 సౌండ్ బార్ ధర : రూ. 7,999

ఈ సౌండ్ బార్స్ Flipkart.com మరియు boultaudio.com నుండి సేల్ కి అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్ బార్స్ పైన మంచి బ్యాంక్ ఆఫర్లను కూడా Flipkart ఆఫర్ చేస్తోంది.

BassBox X120: ఫీచర్స్

ఈ బోల్ట్ కొత్త సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ మరియు బార్ తో టోటల్ 120W సౌండ్ అందిస్తుంది. ఇది 2.1 ఛానెల్ సౌండ్ బార్ మరియు ఇంటిగ్రేటెడ్ DSP తో వస్తుంది. ఇది రియల్ టైమ్ ఆడియో అప్ స్కెలింగ్ మరియు రిచ్ ఆడియో ప్రోసెసింగ్ వంటి ఫీచర్స్ కలిగి వుంది. ఇక కనెక్టివిటీ పరంగా, Aux, ఆప్టికల్, HDMI Arc మరియు Bluetooth వంటి మల్టీ కనెక్టివిటీ లకు సపోర్ట్ వుంది.

Also Read: Vivo V30e launch: వివో అప్ కమింగ్ ఫోన్ ఈ టాప్ ఫీచర్స్ తో మే 2న లాంఛ్ అవుతోంది.!

BassBox X180: ఫీచర్స్

Boult Bass Box
Boult Bass Box

ఈ సౌండ్ బార్ టోటల్ 180W RMS సౌండ్ అవుట్ పుట్ ను అందిస్తుంది. ఇది 2.1 ఛానెల్ సౌండ్ బార్ మరియు వర్చువల్ 3D సౌండ్ స్టేజ్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ పవర్ ఫుల్ సౌండ్ అందించ గల సెపరేట్ సబ్ ఉఫర్ మరియు బార్ లో 2 BoomX స్పీకర్లను కూడా కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ డేడికేటెడ్ DSP Processor తో పని చేస్తుంది మరియు EQ తో కూడా వస్తుంది.

ఈ సౌండ్ బార్ లో Bluetooth 5.3 కనెక్టివిటీ మరియు HDMI Arc, Aux, ఆప్టికల్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo