Vivo V30e launch: వివో అప్ కమింగ్ ఫోన్ ఈ టాప్ ఫీచర్స్ తో మే 2న లాంఛ్ అవుతోంది.!

Vivo V30e launch: వివో అప్ కమింగ్ ఫోన్ ఈ టాప్ ఫీచర్స్ తో మే 2న లాంఛ్ అవుతోంది.!
HIGHLIGHTS

వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ Vivo V30e స్మార్ట్ ఫోన్ వస్తోంది

మే 2 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తోంది

ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కూడా వెల్లడించింది

Vivo V30e launch: వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివో వి30e స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ ను కూడా వివో ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను మే 2 వ తేదీ ఎం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ కోసం కంపెనీ చేపట్టిన టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ కీలకమైన స్పెక్స్ మరియు ఫీచర్స్ ను కూడా వెల్లడించింది.

Vivo V30e launch

వివో ఈ ఫోన్ ను అప్ కమింగ్ ఫోన్ ను Luxury లుక్ మరియు ఫీల్ అందించేలా Gem Cut డిజైన్ తో తీసుకువస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ ఎంటువంటి లుక్స్ తో ఉంటుందో తెలియ చేసింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ తో ఈ ఫోన్ పైన అంచనాలను పెంచింది.

ఇక ఈ ఫోన్ యొక్క టాప్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో అందించిన Display, Camera మరియు Battery మూడు వివరాలు గురించి కంపెనీ గొప్పగా చెబుతోంది. అయితే, ప్రస్తుతానికి వివో ఈ మూడు వివరాలను మాత్రమే బయటపెట్టింది.

Display

వివో వి30e స్మార్ట్ ఫోన్ అల్ట్రా స్లిమ్ 3D కర్వుడ్ డిస్ప్లేను కలిగి వుంది. ఈ స్క్రీన్ చాలా వైబ్రాంట్ గా మరియు ఎక్కువ వంగిన అంచులను కల్గియు ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో పైన సెంటర్ ;పంచ్ హోల్ డిజైన్ ను కలిగి వుంది.

Also Read: 10 నుండి 15 వేల ధరలో లేటెస్ట్ గా విడుదలైన Best 5G Phones ఇవే.!

Camera

వివో వి30e స్మార్ట్ ఫోన్ స్టూడియో క్వాలిటీ Aura Light Portrait తో గొప్ప కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో, వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ఆరా లైట్ ఉన్నాయి. ఈ డ్యూయల్ కెమెరా సెటప్ లో 50MP Sony IMX882 ప్రధాన సెన్సార్ 50mm ఫోకాల్ లెంగ్త్ తో DSLR వంటి డీటెయిల్స్ కలిగిన ఫోటోలు అందించగలదని వివో గొప్పగా చెబుతోంది.

Vivo V30e launch (Camera)
Vivo V30e Camera

అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP Eye AF సెల్ఫీ కెమెరా ఉన్నట్లు కూడా వివో కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో వెడ్డింగ్ స్టైల్ పోర్ట్రైట్ ఫోటోలు పొందవచ్చని కూడా తెలిపింది.

Battery

ఈ ఫోన్ లో గొప్ప బ్యాటరీ సెటప్ ఉన్నట్లు కూడా టీజర్ ద్వారా చెబుతోంది. ఈ ఫోన్ ను 4-year బ్యాటరీ హెల్త్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ తో తీసుకువస్తున్నట్లు చెబుతోంది. అంతేకాదు, ఈ 5500 mAh బ్యాటరీతో అత్యంత సన్నని ఫోనుగా ఉంటుందని, ఈ కేటగిరిలో ఇండియాలో ఇదే మొదటి ఫోన్ అవుతుందని కూడా చెబుతోంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo