Gold Price Drop: ఈరోజు మార్కెట్ లో పడిపోయిన బంగారం ధర.!

Gold Price Drop: ఈరోజు మార్కెట్ లో పడిపోయిన బంగారం ధర.!
HIGHLIGHTS

ఈరోజు మార్కెట్ లో పడిపోయిన బంగారం ధర

చాలా కాలంగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు పడిపోయింది

గోల్డ్ సూచీలు ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగజారాయి

Gold Price Drop: ఈరోజు మార్కెట్ లో పడిపోయిన బంగారం ధర. చాలా కాలంగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు పడిపోయింది. గత మూడు రోజల్లోనే గోల్డ్ ధర 900 లకు పైగా పెరుగుదలను నమోదు చెయ్యగా, ఈరోజు మాత్రం 430 రూపాయలు క్రిందకు పడింది. గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ సూచీలు ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగజారాయి. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా కొనసాగుతోందో పరిశీలిద్దాం.                          

Gold Price Drop:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 51,300 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 400 రూపాయలు క్రిందకు దిగి, రూ.50,900 రూపాయల వద్దకు చేరుకుంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.55,960 రూపాయల నుండి రూ.55,530 రూపాయల వద్దకు చేరుకుంది.

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,530 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,530 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,680 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే కోయంబత్తూర్ లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు కోయంబత్తూర్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,620 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo