ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యకుండా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేసే బెస్ట్ ట్రిక్.!
వాట్సాప్ యూజర్ల కోసం ఒక చిన్న ట్రిక్
ఈ ట్రిక్ తో మీ మొబైల్ ఇంటర్నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ని మాత్రమే ఆఫ్ చేయవచ్చు
వాట్సాప్ ఆన్లైన్ చూపించకూడదు అని కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది
ఈరోజు వాట్సాప్ యూజర్ల కోసం ఒక చిన్న మరియు ఉయోగకరమైన బెస్ట్ ట్రిక్ అందిస్తున్నాను. ఈ ట్రిక్ తో మీ మొబైల్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే Whatsapp ని మాత్రమే ఆఫ్ చేయవచ్చు. ఇంటర్నెట్ ఆన్ లో ఉన్నా కూడా వాట్సాప్ ఆన్లైన్ చూపించకూడదు అని కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు వచ్చే Whatsapp నోటిఫికేషన్ల నుండి కూడా తప్పించుకోవచ్చు.
అయితే, నెట్ ఆఫ్ చెయ్యకుండా Whatsapp ఆఫ్ చెయ్యడానికి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి 'Pause It App' డౌన్ లోడ్ చేసి ఉపయోగించ వలసి వుంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ లో 4 స్టార్ రేటింగ్ తో వుంది. అయితే, తర్డ్ పార్టీ యాప్ ని ఉపయోగించడం సేఫ్ అని మీరు అనుకుంటే మాత్రమే ఈ విధంగా చేయండి. ఈ యాప్ తో మీ ఫోన్ ఇంటర్నెట్ ను ఆఫ్ చెయ్యకుండానే మీ వాట్స్ఆప్ ను ఆఫ్ చెయ్యవచ్చు.
దీనికోసం మీరు మీరుచేయవల్సిందల్లా యాప్ డౌన్ లోడ్ చేసుకొని ఇన్ స్టాల్ చేయ్యడమే. తరువాత, యాప్ లో Active Apps పైన ఉన్న టోగుల్ బటన్ ని నొక్కితే చాలు మీకు కావాల్సిన యాప్స్ డేటా ఆఫ్ అవుతుంది. అంతేకాదు, మీరు ఎంత సమయం మీ వాట్స్ఆప్ ని ఆఫ్ చేయాలనుకుంటారో అంత టైం ను కూడా సెట్ చేసుకోవచ్చు. డేటా ఖర్చు చేయకుండా వాట్స్ఆప్ ఉపయోగించాలి అంటే కూడా ఒక ట్రిక్ వుంది.
వాట్సాప్ లో డేటా వినియోగాన్ని ఎలా తగ్గించవచ్చు
మొదట వాట్సప్ తెరిచి, పైన ఉన్న మూడు నిలువు చుక్కలపై నొక్కండి.
ఇప్పుడు సెట్టింగులకు వెళ్లి డేటా మరియు స్టోరేజ్ ఎంపికను ఎంచుకోండి.
ఇక్కడ ఇచ్చిన తక్కువ డేటా వాడకంలో, మీరు కాల్ ఇన్ డేటాను తగ్గించుకునే ఎంపికను పొందుతారు, దాని ప్రక్కన ఇచ్చిన టోగిల్‌ను ఆన్ చేయండి.
అదేవిధంగా, మీరు వాట్సాప్‌లోని ఫోటోలు మరియు వీడియోల నుండి డేటా వినియోగాన్ని కూడా నిరోధించవచ్చు.
దీని కోసం మీరు మళ్ళీ సెట్టింగులకు వెళ్ళాలి.
ఇప్పుడు మీరు డేటా మరియు స్టోరేజి వినియోగంపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మొబైల్ డేటా ఎంపికను ఉపయోగించి లోపలికి వెళ్లి అన్ని బాక్స్ ల పక్కన ఎంపికను తీసివేయండి.
అదేవిధంగా Wi-Fi లో కనెక్ట్ అయినప్పుడు మరియు రోమింగ్ చేసేటప్పుడు రెండు ఇతర ఎంపికలలో ఒకే విధానాన్ని పునరావృతం చేయండి.