Xiaomi 11T Pro: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు Dolby Vision సపోర్ట్ తో లాంచ్ చేసింది

Xiaomi 11T Pro: 120W ఫాస్ట్ ఛార్జ్ మరియు Dolby Vision సపోర్ట్ తో లాంచ్ చేసింది
HIGHLIGHTS

Xiaomi 11T Pro ఈరోజు ఇండియాలో విడుదల చెయ్యబడింది

Xiaomi 11T  Pro ఈరోజు ఇండియాలో విడుదల చెయ్యబడింది. ఈరోజు ఆవిష్కరించబడిన ఈ స్మార్ట్ ఫోన్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు స్నాప్ డ్రాగన్ 888 చిప్ సెట్ వంటి చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. వాస్తవానికి, Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 2021లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది మరియు ఇప్పుడు భారతదేశానికి వచ్చింది. 

Xiaomi 11T Pro: ప్రైస్

Xiaomi 11T Pro స్మార్ట్ ఫోన్ యొక్క బేస్ వేరియంట్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో రూ. 39,999 ధరతో వచ్చింది. మరొక వేరియంట్ 8GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ ధర రూ. 41,999 కాగా, 12GBర్యామ్ మరియు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.43,999. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్, mi.com, Mi హోమ్ మరియు రిటైల్ అవుట్ లెట్లలో లభిస్తుంది.      

Xiaomi 11T Pro: సెక్స్

షియోమి 11T ప్రో 6.67 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లే ని కలిగివుంటాయి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 360Hz టచ్ శాంప్లింగ్ రేట్ అందిస్తుంది. ఈ ఫోన్ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ ని వుంది. ఇది డస్ట్ మరియు నీటి తుంపరల నుండి రక్షణ కలిగిన IP53 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు MIUI 12.5  యొక్క తాజా వెర్షన్‌లో రన్ అవుతుంది.

కెమెరా పరంగా, ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఇందులో, 108MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 5MP మాక్రో కెమెరాలను జతగా కలిగి ఉంటుంది. ఈ కెమెరాలు 8K UHD లో వీడియోలను 30fps వరకూ రికార్డ్ చేయగలవని కంపెనీ తెలిపింది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.

ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్లను అందించింది. షియోమి 11T ప్రో స్మార్ట్ ఫోన్ 120W హైపర్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 17 నిముషాల్లోనే 100% ఛార్జింగ్ అవుతుందని షియోమి తెలిపింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo