SBI అకౌంట్ ఉన్నవారికి అలర్ట్…! ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే..!

SBI అకౌంట్ ఉన్నవారికి అలర్ట్…! ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే..!
HIGHLIGHTS

SBI తన అకౌంట్ హోల్డర్ల కోసం ఒక అలర్ట్ జారీచేసింది

ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది

150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు

చాలాకాలంగా SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన అకౌంట్ హోల్డర్ల కోసం ఒక అలర్ట్ జారీచేసింది. అదేమిటంటే, కస్టమర్లు వారి స్మార్ట్ ఫోన్లలో ఒక నాలుగు యాప్స్ వలన వాడకం గురించి ఈ అలర్ట్ జరిగించింది. ఎందుకంటే, ఇప్పటికే ఈ నాలుగు యాప్స్ కారణంగా 150 మందికి పైగా ఖాతాదారులు 70 లక్షలకు పైగా పోగొట్టుకున్నారు. అందుకే, SBI కస్టమర్లు వారి ఫోన్లలో ఈ యాప్స్ వాడొద్దని అలర్ట్ జారీచేసింది. ఈ యాప్స్ ను Install చేసుకుంటే మోసగాళ్లు మీ అకౌంట్ ను ఖాళీ చేస్తారని సూచించింది.

విషయం ఏమిటంటే, మోసపూరితమైన లేదా వాటికీ అవకాశం ఇచ్చే కొన్ని యాప్స్ వలన నష్టపోతున్న తన ఖాతాదారులను దృష్టిలో ఉంచుకొని, ఎనిడెస్క్ (Anydesk), క్విక్ సపోర్ట్ (Quick Support), టీమ్ వ్యూవర్ (Teamviewer) మరియు మింగిల్ వ్యూ (Mingleview) యాప్ లను ఇన్స్స్టాల్ చేసుకోవద్దని SBI తన కస్టమర్లను హెచ్చరించింది.

అంతేకాదు, ఏదైనా గుర్తుతెలియని ఒరిజిన్ నుండి ఏదైనా UPI కలెక్ట్ రిక్వెస్ట్ లేదా QR Code వస్తే వాటిని వాటిని స్వీకరించడం లేదా ఆమోదించడం వంటిని చేయవద్దని కూడా తెలిపింది.

అలాగే, SBI వెబ్ సైట్ నుండి హెల్ప్ లైన్ కోసం వెతికేప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఎందుకంటే, ఆన్లైన్లో ఆరు కంటే పైచిలుకు నకిలీ SBI వెబ్ సైట్స్ ఉన్నాయి. అందుకే, ఏదైనా పరిస్కారం కోసం సంప్రదించవలసిన సమయంలో సరైన అధికారిక వెబ్ సైట్ ను మాత్రమే సందర్శించండి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo