వాట్స్అప్ కొత్త పాలసీ యాక్సెప్ట్ చెయ్యక పొతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందా?

వాట్స్అప్ కొత్త పాలసీ యాక్సెప్ట్ చెయ్యక పొతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందా?
HIGHLIGHTS

Whatsapp తన కొత్త ప్రైవసి పాలసీలను ప్రకటించింది.

వాట్స్అప్ కొత్త పాలసీ యాక్సెప్ట్ చెయ్యలేదా

వాట్స్అప్ కొత్త పాలసీ యాక్సెప్ట్ చెయ్యక పొతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందా?

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే Whatsapp తన కొత్త ప్రైవసి పాలసీలను ప్రకటించింది. ఈ కొత్త ప్రైవసి పాలసీ లను యాక్సెప్ట్ చెయ్యడానికి ఫిబ్రవరి 8 ఆఖరి తేదీగా కూడా ప్రకటించింది. అయితే, వినియోగదారులు నుండి తగిలిన నిరసనల కారణంగా ఈ దాన్ని మే 15 తేదికి పోస్ట్ ఫోన్ చేసింది. అయితే, ఇప్పుడు మే 15 నాటికీ Whatsapp కొత్త ప్రైవసి పాలసీలను యాక్సెప్ట్ చేయని వారికీ ఎటువంటి ఇబ్బందులు కలుగనున్నాయనే విషయాన్ని వివరించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఈ నివేదికల ప్రకారం, Whatsapp కొత్త ప్రైవసి పాలసీలను యాక్సెప్ట్ చేయని వారిని, పూర్తిస్థాయి సేవలతో వాట్స్అప్ అకౌంట్ కోసం మే 15 వరకూ యాక్సెప్ట్ చెయ్యమని కోరుతుంది. అప్పటికి కూడా కొత్త పాలసీలను యాక్సెప్ట్ చేయని వారికీ కొన్ని సేవలు నిలిచి పోతాయి. వీటిలో, కొత్త పాలసీలను యాక్సెప్ట్ చెయ్యని వారు, తమ వాట్స్అప్ నుండి మెసేజిలను పంపడం లేదా చదవడం వంటివి చేయలేరు.

కొన్ని రోజుల వరకూ కాల్స్ మరియు నోటికేషన్లకు అవకాశం ఇస్తుంది. కానీ, ఎప్పుడైనా ఆ సర్వీసులను కూడా నిలిపి వేసే అవకాశం ఉందని కూడా తెలిపినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అంటే, ఒక విధంగా చూస్తే కొత్త ప్రైవసీ పాలసీ లను యాక్సెప్ట్ చేయని వినియోగదారులకు వారి అకౌంట్ ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే అవకాశం కోల్పోతారు.

అయితే, Whatsapp యొక్క కొత్త ప్రైవసి పాలసీలు ఎటువంటి ప్రయోజాలను ఆందోస్తుంది అనే విషయాన్ని కూడా వివరించింది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo