మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వివరాలు ఎప్పడు కావాలన్నా చెక్ చేసుకోండి

మీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వివరాలు ఎప్పడు కావాలన్నా చెక్ చేసుకోండి
HIGHLIGHTS

(LPG) గ్యాస్ సిలిండర్ నుండి ఆన్లైన్ లో సులభంగా బుక్ చేసుకోవచ్చు.

మీ ఇండేన్ , HP మరియు భారత్ ఎల్పిజి గ్యాస్ను ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు.

ఇప్పుడు ఎల్పిజి సేవలకు సంబంధించిన అన్ని పనులు ఆన్లైన్ లో.

మీరు మీ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) గ్యాస్ సిలిండర్ నుండి ఆన్లైన్ లో సులభంగా బుక్ చేసుకోవచ్చు. అంటే, మీ ఇండేన్ , HP మరియు భారత్ ఎల్‌పిజి గ్యాస్‌ను ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు, ఇప్పుడు ఎల్‌పిజి సేవలకు సంబంధించిన అన్ని పనులు ఆన్‌లైన్‌ లో జరుగుతున్నాయి. అయితే, మీరు మీ సరైన ఖాతాలో ఎల్‌పిజి సబ్సిడీని పొందడం కూడా చాలా ముఖ్యం మరియు దాని గురించి తెలుసుకోవడం కూడా అవసరం. LPG సబ్సిడీ వివరాలలను ఆన్‌లైన్ మరియు ఆఫ్ లైన్ లో కూడా సులభముగా పొందవచ్చు.

వినియోగదారుడు యొక్క సబ్సిడీ మొత్తం గ్యాస్ ఏజెంట్ ఖాతాకు చేరడం వంటివి కొన్ని సార్లు చూస్తుంటాం. అందువల్ల, సబ్సిడీ మొత్తం మీ ఖాతాకు చేరకపోతే, సబ్సిడీ స్టేటస్ ని చెక్ చేయండి. మీరు ఆన్‌లైన్‌లో మై LPG సబ్సిడీని సులభంగా చూడవచ్చు, అంటే మీ ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీ స్టేటస్ తనిఖీ చేయడానికి మీరు ఎక్కడకి పరుగెత్తాల్సిన అవసరం లేదు, మీరు ఇంటి నుండి ఆన్‌లైన్‌లో సబ్సిడీ స్టేటస్ తనిఖీ చేయవచ్చు. అదనంగా, మీరు కాల్ చేయడం ద్వారా మీ ఫిర్యాదును కూడా నమోదు చేసుకోవచ్చు. అందుకే, ఈ రోజు మనం మీ ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీ స్టేటస్ ఎలా తనిఖీ చేయవచ్చో తెలుసుకుందాం.

మీ ఎల్‌పిజి సబ్సిడీ స్టేటస్ ఎలా తనిఖీ చేయాలి?

మీ ఖాతాలో మీకు సబ్సిడీ మొత్తం రాకపోతే మీరు ఏమి చేయాలో చూడండి. ఆన్‌లైన్‌లో సబ్సిడీ రాష్ట్రాలను తనిఖీ చేయడం సులభమయిన మరియు మంచి మార్గం.

  •  ఆన్‌లైన్ సబ్సిడీ స్టేట్స్ (రాష్ట్రాలు) రిపోర్ట్ చూడటానికి, మొదట మీరు www.mylpg.in  సైట్‌కు వెళ్ళాలి.
  •  ఇక్కడ మీరు వాడుతున్న కనెక్షన్ గ్యాస్ కంపెనీ పేరుపై క్లిక్ చేయండి.
  • క్లిక్ చేసినప్పుడు, క్రొత్త పేజీ తెరవబడుతుంది, దీనిలో చాలా అప్షన్ లు కనిపిస్తాయి. మీరు ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్‌ ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తరువాత కస్టమర్ కేర్ సిస్టమ్ యొక్క పేజీ తెరవబడుతుంది.
  • దీనిలో మీరు మీ వివరాలను పూరించాలి. అంటే, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు LPG ID వంటిని ఇవ్వాలి.
  • మీరు IDని నమోదు చేసిన వెంటనే మీ LPGకి సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది.  సబ్సిడీ మొత్తాన్ని ఎప్పుడు చేర్చారు, ఎంత మొత్తాన్ని చేర్చారు వంటి పూర్తి సమాచారం మీకు లభిస్తుంది.
  • మీ ఖాతాకు బదులుగా మరొకరి ఖాతాకు సబ్సిడీ మొత్తం వెళుతుంటే, మీరు ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు.
  • ఆన్‌లైన్‌లో తనిఖీ చేయడం మరియు ఫిర్యాదు చేయడమే కాకుండా, మీరు ఇదే పనిని ఆఫ్‌లైన్‌లో కూడా చెయ్యవచు.

ఆఫ్ లైన్ కోసం

మీ LPG గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ సెంటర్‌ను సందర్శించడం ద్వారా వారు మీ ఖాతాను లింక్ చేశారా లేదా అని మీరు ధృవీకరించవచ్చు. కొన్నిసార్లు బ్యాంకు వైపు కూడా సమస్య ఉంటుంది. కాబట్టి, మీరు ఎల్‌పిజి సబ్సిడీ ఫారమ్‌ను నింపిన బ్యాంకుకు వెళ్లి, మీ బ్యాంక్ ఖాతాను సరైన సమాచారంతో లింక్ చేసిందో లేదో తెలుసుకోవచ్చు. బ్యాంకు నుండి సబ్సిడీ బదిలీ చేయబడిందో లేదో కూడా తెలుసుకోవచ్చు. అయితే, ఇంకా మీ ఖాతాలో డబ్బు రాకపోయినట్లయితే,  అటువంటి పరిస్థితిలో, ఆధార్ కార్డుతో బ్యాంకుకు వెళ్లి తెలుసుకోండి.

ఇది కాకుండా, మీ వద్ద ఇంటర్నెట్ సౌకర్యం లేకపోతే మరియు బ్యాంక్ లేదా పంపిణీ కేంద్రానికి వెళ్ళడానికి సమయం లేకపోతే, మీరు టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చెయ్యవచ్చు .  టోల్ ఫ్రీ నంబర్- 18002333555 కు కాల్ చేసి మీరు ఫిర్యాదు నమోదు చేసుకోవచ్చు.  మీకు ఇప్పటివరకు మై ఎల్‌పిజి సబ్సిడీ పథకం గురించి తెలియకపోతే మరియు మీరు ఈ పథకంలో చేరాలని కోరుకుంటే, వెంటనే మీరు petroleum.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ పథకానికి కనెక్ట్ అవ్వండి.

ఆధార్ కార్డు ద్వారా ఎల్‌పిజి సబ్సిడీని పొందండి

దీని కోసం, మొదట మీ ఆధార్ కార్డును మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయండి, దీన్ని చేయడానికి మీరు మీ బ్యాంకును సందర్శించాలి లేదా మీరు దీన్ని ఆన్‌లైన్‌లో కూడా చేయవచ్చు. దీని కోసం, మీరు మీ బ్యాంక్ వెబ్‌సైట్‌కు వెళ్లాలి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo