షావోమి మి కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 ఇండియాలో విడుదలైనది రూ . 799 ధరతో
ఈ బ్లూటూత్ స్పీకర్ 6 గంటల ప్లే బ్యాక్ అందిస్తుందని షావోమి పేర్కొంది, మరియు ఇది హాండ్స్ ఫ్రీ క్లింగ్ కోసం అంతర్గత మైక్ తో వస్తుంది.
షావోమి తన మి కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్ 2 ను భారతదేశంలో రూ .799 ధరతో ప్రారంభించింది. ఈ స్పీకర్ సంస్థ యొక్క అధికారిక స్టోర్ Mi.com లో జాబితా ఇది చేయబడింది. ఈ లిస్టింగ్ ప్రకారం, ఇన్ కమింగ్ కాల్స్ ను వినియోగదారులు అనుమతించడానికి పవర్ బటన్ నోకాల్సివుంటుంది, ఈ స్పీకర్లో అంతర్నిర్మిత మైక్రోఫోన్ ఉంది. దీని వాల్యూమ్ 80 శాతం వద్ద ఉంచికూడా, ఈ స్పీకర్ ఆరు గంటల బ్యాటరీ జీవితాన్ని అందించగలదని షావోమి పేర్కొంది.
Surveyఈ బ్లూటూత్ స్పీకర్, బ్లూటూత్ వెర్షన్ 4.2 మరియు 10 మీటర్ల దూరం వరకు కనెక్టువిటీతో వస్తుంది. స్పీకర్ యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ పరిధి 200Hz నుండి 18kHz మధ్య ఉంటుంది మరియు ఇది 480mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మైక్రో- USB పోర్ట్ ద్వారా బ్యాటరీ ఛార్జ్ చేయబడుతుంది, అయితే, దీని బాక్స్ లో USB ఛార్జింగ్ కేబుల్ ని షావోమి ఇవ్వలేదు. ఈ స్పీకర్ ఒకే రకమైన బటన్ను కలిగి ఉంది, బ్లూటూత్ జతచేయడం, ప్లేయింగ్ / మ్యూజిక్ పాజ్, కాల్స్ కి స్పందించడం మరియు తిరస్కరించడం మరియు ఫ్యాక్టరీ సెట్టింగులను పునరుద్ధరించడం వంటివి ఇందులో ఉన్నాయి.
షావోమి భారతదేశం లో తన ప్రొడక్టుల మీద ధర తగ్గించిన ఒక వారం తరువాత నుండి అభివృద్ధి కనబడుతుంది. ఈ చైనీస్ టెక్ దిగ్గజం, మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది, 55 అంగుళాల Mi LED TV 4 Pro, 49-అంగుళాల Mi LED TV 4A Pro మరియు 32-అంగుళాల MI LED TV 4C Pro. అలాగే, మి బ్యాండ్ 3, దాని మి హోమ్ 360 డిగ్రీల సెక్యూరిటీ కెమెరా, మి ఎయిర్ ప్యూరిఫయర్ 2 ఎస్ మరియు మి లగేజ్ యొక్క రెండు మోడళ్లను కూడా ప్రారంభించింది. జూన్లో, సంస్థ Mi పాకెట్ స్పీకర్ 2 ను 5W స్పీకర్ డ్రైవర్తో ప్రారంభించింది, ఇది జర్మన్ ఆడియో ఇంజనీరింగ్ సంస్థ టాంఫనీ తయారు చేసింది. వైర్లెస్ స్పీకర్ బ్లూటూత్ 4.1 కి మద్దతు ఇస్తుంది మరియు 1200mAh యూనిట్తో వస్తుంది, ఇది కంపెనీ వాదనల ప్రకారం, 7 గంటల వరకు నిరంతరాయంగా సంగీత ప్లేబ్యాక్ ఇస్తుందని చెబుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile