మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా నిలిచిన OnePlus Realme విలీనం

HIGHLIGHTS

2026 లో స్మార్ట్‌ ఫోన్ ఇండస్ట్రీలో బిగ్ అండ్ హాట్ న్యూస్ ఈరోజు వెలువడింది

OnePlus మరియు Realme రెండు కంపెనీలను కూడా ఒప్పో విలీనం చేస్తున్నట్లు వచ్చిన వార్త

ఈ రెండు కంపెనీల పేరెంట్ కంపెనీ అయిన Oppo యొక్క కొత్త వ్యూహంగా ఈ చర్య గురించి చెబుతున్నారు

మొబైల్ ఫోన్ ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా నిలిచిన OnePlus Realme విలీనం

2026 లో స్మార్ట్‌ ఫోన్ ఇండస్ట్రీలో బిగ్ అండ్ హాట్ న్యూస్ ఈరోజు వెలువడింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలైన OnePlus మరియు Realme రెండు కంపెనీలను కూడా ఒప్పో విలీనం (merge) చేస్తున్నట్లు వచ్చిన వార్త పెద్ద దుమారమే లేపింది. ఈ రెండు కంపెనీల పేరెంట్ కంపెనీ అయిన Oppo యొక్క కొత్త వ్యూహంగా ఈ చర్య గురించి చెబుతున్నారు.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Realme విలీనం

తాజా రిపోర్ట్స్ ప్రకారం, వన్ ప్లస్ మరియు రియల్ మీ కంపెనీ లను ఒకటిగా చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు ఎందుకంటే వన్ ప్లస్ మరియు రియల్ మీ కంపెనీలు పూర్తిగా ఒకే కంపెనీగా కలిసిపోవడం లేదు. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ టీమ్స్, మార్కెటింగ్ మరియు సర్వీస్ వ్యవస్థలు ఒకటిగా చేశారు ఇది మాత్రమే నిజం. ఇలా కలిపి ఒక కొత్త “sub-product center” ఏర్పాటు చేశారు. ఇలా అందించిన ఈ కొత్త యూనిట్ గ్లోబల్ మరియు చైనా మార్కెట్ల కోసం కలిసి పనిచేస్తుంది.

Also Read: OnePlus Pad 4: ప్రీమియం ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది.!

OnePlus Realme విలీనానికి కారణం ఏమిటి?

ఇలా రెండు కంపెనీలను విలీనం చేయడానికి ప్రధాన కారణం ఖర్చులు తగ్గించడం అని చెప్పొచ్చు. ఒకే టెక్నాలజీని రెండు బ్రాండ్స్ వేర్వేరుగా తయారు చేయడం ఖరీదైన పనిగా ఉంటుంది. అందుకే, ఇప్పుడు రెండు కంపెనీలు ఒకటి కావడంతో వల్ల ఖర్చు తగ్గుతుంది.

కేవలం ఖర్చు తగ్గించడం మాత్రమే కారణం కాదు. పనితీరు మెరుగు పరచడం కూడా ఈ చర్యకు దారి తీసిన మరో కారణం కావచ్చు. ఎందుకంటే, రెండు బ్రాండ్స్ టెక్నాలజీ కలిస్తే కొత్త ఫోన్లు వేగంగా డెవలప్ అవుతాయి. అంతేకాదు, మరింత మెరుగైన మొబైల్ ఫోన్స్ అందించడం సులభం అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile