vivo S2 FE 5G సేల్ ఈరోజు నుంచి భారీ ఆఫర్స్ తో ప్రారంభమైంది .. బెస్ట్ డీల్స్ అందుకోండి.!
vivo S2 FE 5G సేల్ ఈరోజు నుంచి భారీ ఆఫర్స్ తో ప్రారంభమైంది
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను 10000mAh భారీ బ్యాటరీతో మంచి స్లీక్ డిజైన్ లో అందించింది
ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి మార్కెట్ లో సేల్ కి అందుబాటులోకి వచ్చింది
vivo S2 FE 5G సేల్ ఈరోజు నుంచి భారీ ఆఫర్స్ తో ప్రారంభమైంది. ఇది వివో రీసెంట్ గా విడుదల చేసిన మిడ్ రేంజ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్. వివో ఈ స్మార్ట్ ఫోన్ ను 10000mAh భారీ బ్యాటరీతో మంచి స్లీక్ డిజైన్ లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను చూడముచ్చటైన డిజైన్ తో బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో మార్కెట్ కి పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఈరోజు నుంచి మార్కెట్ లో సేల్ కి అందుబాటులోకి వచ్చింది.
Surveyvivo S2 FE 5G : ప్రైస్
వివో ఈ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లంచ్ చేసింది. ఈ రెండు వేరియంట్ ప్రైస్ లిస్ట్ ఇక్కడ చూడొచ్చు.
- వివో ఎస్ 2 FE (6GB + 128GB) ప్రైస్ : రూ. 38,999
- వివో ఎస్ 2 FE (8GB + 128GB) ప్రైస్ : రూ. 42,999
వివో ఈ స్మార్ట్ ఫోన్ ను టైటాన్ బ్లాక్, స్టెల్లార్ గ్రీన్ మరియు జెన్ వైట్ అనే యూదు అందమైన కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

ఆఫర్స్
వివో ఈ ఫోన్ పైన భారీ 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ బేసిక్ వేరియంట్ పై రూ. 3,900 మరియు ఈ ఫోన్ హై ఎండ్ వేరియంట్ పై రూ. 4,300 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను మీరు అందుకోవచ్చు. ఈ ఫోన్ ను HDFC, ICICI మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో తీసుకునే వారికి ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ రూ. 35,099 రూపాయల స్టార్టింగ్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ మరియు వివో అధికారిక సైట్ నుంచి లభిస్తుంది.
Also Read: Flipkart కొత్త సేల్ నుంచి కేవలం 6 వేలకే 525W 5.1 Dolby సౌండ్ బార్ ఆఫర్ చేస్తోంది.!
vivo S2 FE 5G : ఫీచర్స్
ఈ వివో కొత్త ఫోన్ 6.83 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 1.5K రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ప్రీమియం ఫీచర్స్ తో వస్తుంది. మీడియాటెక్ Dimensity 7300e చిప్ సెట్ తో వివో ఈ ఫోన్ ను అందించింది. మరింత వేగవంతమైన పెర్ఫార్మెన్స్ కోసం 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాని కలిగి ఉంటుంది. ఈ సెటప్ లో 50MP Sony ప్రధాన కెమెరా మరియు 2MP కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ వివో ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంది మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 10,000 mAh భారీ బ్యాటరీని వివో అందించింది. అంతేకాదు, 44W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ అండ్ ఛార్జర్ ను కూడా ఫోన్ తో అందిస్తుంది. ఇది IP68 అండ్ IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile
