OnePlus Pad 4: ప్రీమియం ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

వన్ ప్లస్ ఇండియన్ మార్కెట్లో ఈరోజు తన లేటెస్ట్ టాబ్లెట్ ని విడుదల చేసింది

OnePlus Pad 4 ను ల్యాప్ టాప్ వంటి గొప్ప ప్రొడక్టివిటీ అందించే ఫీచర్స్ తో అందించడం విశేషం

ఈ పాడ్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ మొబైల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది

OnePlus Pad 4: ప్రీమియం ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది.!

OnePlus Pad 4: వన్ ప్లస్ ఇండియన్ మార్కెట్లో ఈరోజు తన లేటెస్ట్ టాబ్లెట్ ని విడుదల చేసింది. అదే, వన్ ప్లస్ పాడ్ 4 మరియు ఈ టాబ్లెట్ ను ల్యాప్ టాప్ వంటి గొప్ప ప్రొడక్టివిటీ అందించే ఫీచర్స్ తో అందించడం విశేషం. వన్ ప్లస్ లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ పవర్ ఫుల్ టాబ్లెట్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దాం పదండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus Pad 4: ప్రైస్

ఈ లేటెస్ట్ పాడ్ ను వన్ ప్లస్ రెండు వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ పాడ్ (8GB + 256GB) బేసిక్ వేరియంట్ ను రూ. 59,999 ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ పాడ్ రెండో మరియు హై ఎండ్ వేరియంట్ (12GB + 512GB) వేరియంట్ ను రూ. 64,999 రూపాయల ప్రీమియం ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ పాడ్ డూన్ గ్లో మరియు సెజ్ మిస్ట్ రెండు రంగుల్లో లభిస్తుంది.

సేల్ అండ్ ఆఫర్స్

వన్ ప్లస్ కొత్తగా లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ పాడ్ మే 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ పాడ్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ పాడ్ ను HDFC క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 5,000 రూపాయల అదనపు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్ ని వన్ ప్లస్ ఈ పాడ్ తో అందించింది.

OnePlus Pad 4: ఫీచర్స్

వన్ ప్లస్ ఈ కొత్త పాడ్ ను 13.2 అంగుళాల పెద్ద LCD డిస్‌ప్లే తో అందించింది. ఈ స్క్రీన్ 12-bit (8+4-bit) స్క్రీన్ మరియు 89.4% స్క్రీన్ టు బాడీ రేషియో కలిగి ఉంటుంది, ఇక ఈ డిస్‌ప్లే అదనపు ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది 3.4K రిజల్యూషన్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటమే కాకుండా HDR మరియు Dolby Vision సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా అద్భుతంగా ఉంటుంది.

OnePlus Pad 4 Price

ఈ పాడ్ ను క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ పవర్ ఫుల్ మొబైల్ చిప్ సెట్ Snapdragon 8 Elite Gen 5 తో లాంచ్ చేసింది. ఈ పవర్ ఫుల్ చిప్ సెట్ కి జతగా 12GB RAM మరియు 512GB హెవీ స్టోరేజ్ కూడా అందించింది. ఇది PC లాంటి ప్రొడక్టివిటీ అందిస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఈ పాడ్ లో వెనుక 13MP రియర్ మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ పాడ్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

OnePlus Pad 4 Features

ఇక ఈ పాడ్ బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 13,380mAh భారీ బ్యాటరీ ని వన్ ప్లస్ అందించింది. ఈ బిగ్ బ్యాటరీ కలిగిన ఈ పాడ్ ను వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఇది ఇప్పటి వరకు వన్ ప్లస్ అందించిన టాబ్లెట్ లో అతిపెద్ద బ్యాటరీ కలిగిన టాబ్లెట్ గా నిలిచింది. ఇది సపోర్ట్ ఇది Wi-Fi పై మాత్రమే పని చేసే టాబ్లెట్.

Also Read: Samsung 5.1 Dolby సౌండ్ బార్ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఆల్ టైమ్ చవక ధరలో లభిస్తోంది.!

సౌండ్ పరంగా, ఇందులో మొత్తం 8 స్పీకర్లు ఉంటాయి. 4 వీటిలో బాస్ స్పీకర్లు మరియు 4 ట్వీటర్ లు ఉంటాయి. అంతేకాదు, హై రిజల్యూషన్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇది వన్ ప్లస్ స్టయిల్ మరియు కీ ప్యాడ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ లో బిగ్ బ్యాటరీ మరియు పవర్ ఫుల్ ఫీచర్స్ తో కేవలం 5.94mm మందంతో అల్ట్రా స్లీక్ డిజైన్ తో అందించడం విశేషం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile