iQOO Neo 10: న్యూ వేరియంట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ కొత్త కలర్ వేరియంట్స్ ను ఈరోజు లాంచ్ చేసింది

ఈ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యి మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఈ ఫోన్ ఇప్పుడు ఆల్ స్పైన్ వైట్ మరియు ఆస్పాల్ట్ బ్లాక్ రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది

iQOO Neo 10: న్యూ వేరియంట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తెలుసుకోండి.!

iQOO Neo 10: గత సంవత్సరం ఇదే నెలలో భారీ ఫీచర్స్ తో ఐకూ ఇండియాలో విడుదల చేసిన ఐకూ నియో 10 స్మార్ట్ ఫోన్ కొత్త కలర్ వేరియంట్స్ ను ఈరోజు లాంచ్ చేసింది. ఈ ఫోన్ రేంజ్ ధరలో భారీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యి మార్కెట్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే, ఈ ఈ ఫోన్ సక్సెస్ ను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఐకూ ఈ ఫోన్ ను మరో రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ వేరియంట్స్ ప్రైస్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

iQOO Neo 10: ప్రైస్

ఈ ఫోన్ రెండు కొత్త వేరియంట్ లను కూడా రెండు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ లో అందించింది. ఈ ఫోన్ 8GB + 256GB వేరియంట్ ను రూ. 37,999 రూపాయల ప్రైస్ తో మరియు ఈ ఫోన్ 12GB + 256GB వేరియంట్ ను రూ. 42,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇప్పుడు ఆల్ స్పైన్ వైట్ మరియు ఆస్పాల్ట్ బ్లాక్ రెండు కొత్త కలర్ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది.

సేల్ అండ్ ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ మే 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సేల్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఐకూ అందించింది. ఈ ఫోన్ పై Axis మరియు SBI క్రెడిట్ కార్డు రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

Also Read: OnePlus Pad 4: ప్రీమియం ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది.!

iQOO Neo 10: ఫీచర్స్

ఐకూ నియో 10 ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 5500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తొ పాటు ఐ ప్రొటెక్షన్ ఫీచర్స్ కూడా ఫీచర్స్ తో కూడా వస్తుంది. ఐకూ ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో iQOO Q1 సూపర్ కంప్యూటింగ్ అదనపు చిప్ తో కూడా వస్తుంది. ఇది ఐకూ స్మార్ట్ ఫోన్ గొప్ప పెర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది మరియు 144 FPS తో గొప్ప గేమింగ్ సపోర్ట్ తో వస్తుంది.

iQOO Neo 10 New variant

ఇందులో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ లో 50MP Sony OIS ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. ఈ ఐకూ ఫోన్ లో ముందు 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఐకూ నియో 10 ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు AI కెమెరా ఫీచర్స్ సపోర్ట్ తో వస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఇది 7000mAh భారీ బ్యాటరీ తో వస్తుంది. అంతేకాదు, 120W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile