OnePlus Nord CE6 సేల్ మే 8వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది.!
OnePlus Nord CE6 స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే సేల్ డేట్ ను వన్ ప్లస్ అనౌన్స్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ సేల్ డేట్ అనౌన్స్ చేసి మరోసారి ఈ ఫోన్ గురించి వార్తల్లో నిలిచింది
OnePlus Nord CE6 స్మార్ట్ ఫోన్ లాంచ్ కంటే ముందే సేల్ డేట్ ను వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చే నెల లాంచ్ అవుతుంది మరియు లాంచ్ అయిన తర్వాత రోజు నుంచి సేల్ కి కూడా అందుబాటులోకి వస్తుందని వన్ ప్లస్ కొత్త అప్డేట్ అందించింది. ఇప్పటికే ఈ ఫోన్ లాంచ్ టీజర్ ఫీచర్స్ తో ఈ ఫోన్ పై హైప్ ను పెంచిన వన్ ప్లస్, ఈ ఫోన్ సేల్ డేట్ అనౌన్స్ చేసి మరోసారి ఈ ఫోన్ గురించి వార్తల్లో నిలిచింది.
SurveyOnePlus Nord CE6: లాంచ్ అండ్ సేల్ డేట్
వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ మే 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ అయిన నెక్స్ట్ డే అంటే, మే 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ కూడా స్టార్ట్ అవుతుందని వన్ ప్లస్ తెలిపింది.
OnePlus Nord CE6 : కీలక ఫీచర్స్
ఈ వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన బిగ్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. అంతేకాదు, గేమింగ్ కోసం అవసరమైన ప్రత్యేకమైన టచ్ రిఫ్లెక్స్ చిప్ కూడా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫైన్ AI సపోర్ట్ తో వస్తుంది.

ఈ ఫోన్ 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది మరియు ముందు 32MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో ఉన్నా కూడా భారీ 8000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Flipkart బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి Air Coolers పై గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది.!
ఈ ఫోన్ మరిన్ని ఇతర ఫీచర్స్ కూడా వన్ ప్లస్ వెల్లడించింది. వన్ ప్లస్ నార్డ్ CE 6 స్మార్ట్ ఫోన్ మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ `IP66, IP68, IP69 మరియు IP66K రేటింగ్ తో గొప్ప వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ గా ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఆక్సిజన్ 16 సాఫ్ట్ వేర్ తో జతగా ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అవుతుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile