Noise ColorFit Hexa: ఆర్క్ వ్యూ AMOLED డిస్ప్లేతో కొత్త స్మార్ వాచ్ తెచ్చిన నోయిస్.!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోయిస్ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది
Noise ColorFit Hexa కొత్త ఆర్క్ వ్యూ AMOLED డిస్ప్లేతో వచ్చింది
లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేసింది
Noise ColorFit Hexa: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోయిస్ కొత్త స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. నోయిస్ కలర్ ఫిట్ హెక్సా పేరుతో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ వాచ్ కొత్త ఆర్క్ వ్యూ AMOLED డిస్ప్లేతో తీసుకు వచ్చింది. వాస్తవానికి, ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ రేపు లాంచ్ అవుతుంది. అయితే, ఈ స్మార్ట్ వాచ్ యొక్క ధర, స్పెక్స్ మరియు ఆఫర్లను పుర్తిగా వెల్లడించింది నోయిస్.
SurveyNoise ColorFit Hexa Price
నోయిస్ కలర్ ఫిట్ హెక్సా స్మార్ట్ వాచ్ ను రూ. 2,499 లాంచ్ ధరతో ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 300 రూపాయల లాంచ్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అనౌన్స్ చేసింది. ముందుగా కొనుగోలు చేసే కొంత మంది యూజర్లకు ఈ ఆఫర్ ను అందుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
Also Read : Amazon Offer: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్.!
నోయిస్ కలర్ ఫిట్ హెక్సా ప్రత్యేకతలు
నోయిస్ కలర్ ఫిట్ హెక్సా స్మార్ట్ వాచ్ ను 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 1.96 ఇంచ్ ఆర్క్ వ్యూ అమోలెడ్ డిస్ప్లేతో తీసుకు వస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ లో 100+ వాచ్ ఫేసెస్, కస్టమైజ్డ్ వాచ్ ఫేసెస్ మరియు యానిమేటెడ్ వాచ్ ఫేసెస్ లకు సపోర్ట్ వుంది. ఇందులో హార్ట్ రేట్ మెజర్మెంట్, స్ట్రెస్ మెజర్మెంట్, SpO2 ట్రాకింగ్, 3 స్టేజ్ స్లీప్ ట్రాకింగ్ మరియు అనాలసిస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్ వాచ్ ను మరింత సౌకర్యవంతంగా మార్చడానికి వీలుగా ఫంక్షనల్ క్రౌన్ ను కూడా అందించింది. ఈ స్మార్ట్ వాచ్ AI Voice కంట్రోల్, మ్యూజిక్ కంట్రోల్ మరియు వాతావరణ అప్డేట్ లను కూడా అందిస్తుంది. ఈ నోయిస్ వాచ్ వైర్లెస్ ఛార్జింగ్ కలిగిన 7 డే వినియోగ బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ వాచ్, టీల్ బ్లూ, క్లాసిక్ బ్రౌన్, వింటేజ్ బ్రౌన్, క్లాసిక్ బ్లాక్ మరియు జెట్ బ్లాక్ వంటి 5 అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.