Amazon Offer: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్.!
వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్
ఈ వన్ ప్లస్ ఫోన్ పైన ఈరోజు Amazon బెస్ట్ డీల్స్ ను అందించింది
రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
Amazon Offer: వన్ ప్లస్ లేటెస్ట్ ఫోన్ OnePlus Nord CE 3 5G పైన బిగ్ డీల్ ప్రకటించింది. 50MP Sony పవర్ ఫుల్ కెమేరా, ఫ్లూయిడ్ డిస్ప్లే మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ వంటి గొప్ప ఫీచర్లతో వచ్చిన ఈ వన్ ప్లస్ ఫోన్ పైన ఈరోజు బెస్ట్ డీల్స్ ను అందించింది. 20 వేల ధరలో వన్ ప్లస్ బ్రాండ్ యొక్క డీసెంట్ స్మార్ట్ ఫోన్ కోణాల్ని చూస్తున్న వారికి ఈరోజు అమేజాన్ అందించిన ఈ డీల్ మంచి ఆప్షన్ అవుతుంది.
SurveyAmazon Offer
అమేజాన్ ఈరోజు వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జి స్మార్ట్ ఫోన్ యొక్క 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 24,999 రూపాయల ధరతో లిస్ట్ చేసింది. వాస్తవానికి ఇది రెగ్యులర్ ధరే అయినా ఈ ఫోన్ పైన ఇతరఆఫర్లను అందించడం ద్వారా ఈ ఫోన్ ను తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది.
వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జి స్మార్ట్ ఫోన్ పైన అమేజాన్ ఈరోజు రూ. 1,000 రూపాయల డిస్కౌంట్ కూపన్ ఆఫర్ ను అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ ను ICICI Bank క్రెడిట్ కార్డ్ మరియు OneCard క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Also Read : MOTOROLA G34 5G పైన బిగ్ బ్యాంక్ డిస్కౌంట్.!
OnePlus Nord CE 3 5G Specs

వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జి ఫోన్ 6.7 ఇంచ్ పరిమాణం గల 120 Hz AMOLED FHD+ డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ మరియు sRGB తో వస్తుంది. ఈ ఫోన్ లో 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000mAh బిగ్ బ్యాటరీ సెటప్ వుంది. ఈ ఫోన్ Qualcomm Snapdragon 782G ప్రోసెసర్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 8GB LPDDR4 ర్యామ్ కి జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది.
ఈ ఫోన్ OxygenOS 13 సాఫ్ట్ వేర్ పైన Android 13.1 OS తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 50MP Sony IMX890 (OIS) + 8MP Sony IMX355 అల్ట్రా వైడ్ + 2MP మ్యాక్రో తో ట్రిపుల్ కెమేరా వుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile