భారీ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart TV

HIGHLIGHTS

2025 దసరా మరియు దీపావళి సేల్ నుంచి ఈరోజు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి

ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది

భారీ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart TV

భారీ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart TV

2025 దసరా మరియు దీపావళి సేల్ మొదలైన విషయం తెలిసిందే. ఈ పండుగ సీజన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ అందించింది. ఈ సేల్ నుంచి ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ తో కేవలం 43 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తున్న 55 ఇంచ్ QLED Smart TV డీల్ వివరాలు ఈరోజు అందిస్తున్నాము.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటా 55 ఇంచ్ QLED Smart TV డీల్?

ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి Thomson యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 55TJQ0032 పై 43% భారీ డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి కేవలం రూ. 25,299 రూపాయల ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై మరో భారీ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ICICI మరియు Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

Flipkart BBD Sale QLED Smart TV Deal

ఈ బిగ్ డిస్కౌంట్ తో ఈ థాంసన్ లేటెస్ట్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 23,799 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. అంటే, కేవలం 43 నుంచి రేటుకే ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ లభిస్తుంది.

Thomson (55) QLED Smart TV: ఫీచర్స్

ఈ థాంసన్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గా ఇండియాలో అడుగుపెట్టిన JioTele OS సిరీస్ స్మార్ట్ టీవీ మరియు ఇది మంచి ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. ఇది నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్ స్టార్ మరియు మరిన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీ 450 నిట్స్ బ్రైట్నెస్, 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ 55 ఇంచ్ థాంసన్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రెండు స్పీకర్లు కలిగి 48W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Audio మరియు DTS సరౌండ్ సౌండ్ టెక్నాలజీ తో మంచి ఆడియో కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 8 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI, USB, బ్లూటూత్, బిల్ట్ ఇన్ Wi-Fi, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: BSNL 4G: స్వదేశీ 4G సర్వీస్ ఆవిష్కరించిన ప్రధాని మోదీ.!

ఈ థాంసన్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.3 రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ టీవీని మీరు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరలో అందుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo