BSNL 4G: స్వదేశీ 4G సర్వీస్ ఆవిష్కరించిన ప్రధాని మోదీ.!
స్వదేశీ 4G సర్వీస్ ను ఈరోజు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ నిర్మించిన BSNL 4G
ఉత్తమ 4జి నెట్వర్క్ మరియు గొప్ప వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఆనందించండి
BSNL 4G: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ నిర్మించిన స్వదేశీ 4G సర్వీస్ ను ఈరోజు గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. ప్రభుత్వ టెలికాం బిఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో Tejas Networks (RAN) మరియు TCS (సిస్టమ్ ఇంటి గ్రేటర్) సంయుక్తంగా ఈ స్వదేశీ 4జి సర్వీస్ ను అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేశం మొత్తం ఉత్తమ 4జి నెట్వర్క్ మరియు గొప్ప వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు ఆనందించండి అని ఈ సర్వీస్ ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని వెల్లడించారు.
SurveyBSNL 4G:
దేశం మొత్తం నలు వైపులా ప్రతి గ్రామానికి కూడా నాణ్యమైన 4జి సర్వీస్ ను అందించడానికి పూనుకున్న ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ 37,000 కోట్ల రూపాయలు వెచ్చించి 97,500 4G టవర్‌లు నిర్మాణం చేపట్టింది. 2025 జూన్ నాటికి ఈ నిర్మాణం పూర్తి చేసుకొని పూర్తి స్థాయి 4జి నెట్‌వర్క్ అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికలు చేసింది. అయితే, ఎట్టకేలకు ఈ సర్వీస్ లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చింది.
బిఎస్ఎన్ఎల్ నిర్మించిన మొత్తం టవర్స్ లో 92,600 టవర్‌లు స్వదేశీ టెక్నాలజీతో నిర్మాణం చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు, DBN (Digital Bharat Nidhi) ద్వారా 18,900 సైట్లు, 26,707 గ్రామాలను కవర్ చేసేందుకు ప్రణాళిక చేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మరింత ఉన్నతమైన నెట్వర్క్ కోసం 5,985 టవర్‌లు ఏర్పాటు చేసినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

కేవలం 4జి మాత్రమే కాదు బిఎస్ఎన్ఎల్ నిర్మించిన ఈ కొత్త నెట్వర్క్ సర్వీస్ 5G రెడీ నెట్వర్క్ కూడా అవుతుంది. అంటే, త్వరలోనే 5G సర్వీస్ తేవడానికి ఇది సహాయం చేసే అవకాశం ఉంటుంది.
Connecting Every Indian, Empowering Every Dream!
— DoT India (@DoT_India) September 27, 2025
Hon’ble PM Shri @narendramodi unveiled India’s #Swadeshi 4G Network, a milestone in self-reliance that brings world-class telecom to every corner of Bharat.#AtmanirbharBSNL #BSNLRising pic.twitter.com/cju3ki6Lee
దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచేసి ఎక్కువ రేట్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నా కూడా నెట్వర్క్ ఇష్యూస్ కారణంగా యూజర్లు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ మారలేక పోతున్నట్లు ఎక్కువగా కంప్లైట్స్ అందుకుంది. అయితే, ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ నిర్మించిన కొత్త 4జి సర్వీస్ ద్వారా ఇప్పుడు నెట్‌వర్క్ సమస్య తీరుతుంది కాబట్టి కొత్త బిఎస్ఎన్ఎల్ కు కొత్త కస్టమర్ల తాకిడి పెరగవచ్చని చాలా మంది భావిస్తున్నారు.
Also Read: Google Pixel 8a భారీ డిస్కౌంట్ తో సగం ధరకే సేల్ అవుతోంది.. ఎక్కడంటే.!
మరి ఈ కొత్త ప్రణాళికతో బిఎస్ఎన్ఎల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయో చూడాలి. త్వరగా 5జి సేవలు కూడా అందుబాటులోకి వస్తే యూజర్లకు మరింత గొప్పగా ఉంటుందని చాలా మంది బడ్జెట్ టెలికాం యూజర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.