Google Pixel 8a భారీ డిస్కౌంట్ తో సగం ధరకే సేల్ అవుతోంది.. ఎక్కడంటే.!
Google Pixel 8a ఫోన్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్
ఈ గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం సగం ధరకే లభిస్తోంది
ఇది గూగుల్ యొక్క సూపర్ కెమెరా సపోర్ట్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ ను బడ్జెట్ ధరలో కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఈ గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఈరోజు భారీ డిస్కౌంట్ అందుకొని కేవలం సగం ధరకే లభిస్తోంది. ఈ ప్రైస్ లో ఈ ఫోన్ భారీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇది గూగుల్ యొక్క సూపర్ కెమెరా సపోర్ట్ మరియు ప్రీమియం డిజైన్ తో వస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ బిగ్ గూగుల్ స్మార్ట్ ఫోన్ డీల్ పై లుక్కేద్దామా.
SurveyGoogle Pixel 8a : ఆఫర్
ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 52,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి 43% భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 29,999 ధరకే సేల్ అవుతుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ ICICI క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

ఈ రెండు ఆఫర్స్ తో ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 26,499 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. అంటే, ఈ ఫోన్ లాంచ్ ధరతో పోలిస్తే ఈ ఫోన్ కేవలం సగం ధరకే లభిస్తుంది.
Also Read: Xiaomi 17 Pro Max: నాలుగు 50MP కెమెరాలు మరియు స్నాప్ డ్రాగన్ Elite 8 Gen 5 తో లాంచ్.!
Google Pixel 8a : ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ 6.1 OLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులో ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, HDR సపోర్ట్, FHD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 24 Bit ప్యానల్ ను 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా సెక్యూరిటీ చిప్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ ఫోన్ లో వెనుక 64MP ప్రధాన కెమెరా జతగా 13MP వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గుట్టల కొద్దీ గూగుల్ కెమెరా ఫీచర్స్, AI కెమెరా ఫీచర్స్ తో పాటు 60FPS వద్ద స్టేబుల్ 4K వీడియో షూట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల OS రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ మరియు OS అప్డేట్స్ కూడా అందుకుంటుంది. ఈ ఫోన్ వన్ డే బ్యాకప్ అందించే బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.