Realme TV గొప్ప ఫీచర్లతో తక్కువ ధరలో ఇండియాలో లాంచ్

Realme TV గొప్ప ఫీచర్లతో తక్కువ ధరలో ఇండియాలో లాంచ్
HIGHLIGHTS

Realme TV 32-అంగుళాల ధర రూ .12,999

ఇది 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్‌ తీసుకొస్తుంది.

Realme తన మొట్టమొదటి స్మార్ట్ వాచ్ మరియు రియల్మి టీవీ సిరీస్ ను భారతదేశంలో సరసమైన బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌ ఫోన్లతో పాటు ఆవిష్కరించింది. వాస్తవానికి, ఈ స్మార్ట్ వాచ్ మరియు టీవీ సిరీస్  చాలా కాలం నుండి ఆన్లైన్లో లాంచ్ చేయనున్నట్లు చెబుతుండగా, కంపెనీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా టీజర్లను వదులుతోంది. ఈ కొత్త ప్రోడక్టుల  ప్రారంభంతో, రియల్మి, షావోమి అడుగుజాడల్లో నడుస్తునట్లు అనిపిస్తుంది. షావోమి,  2018 లో ప్రారంభమైన టెలివిజన్ సిరీస్ ద్వారా గణనీయమైన వినియోగదారు బేస్ కలిగి ఉంది.

Realme TV : ఫీచర్లు మరియు ధర

రియల్మి టీవీ రెండు సైజుల్లో  వస్తుంది అవి :  HD-Ready 32-ఇంచ్ మరియు 43-ఇంచ్ FHD మరియు 178-డిగ్రీల వ్యూ ఇంగ్  కోణాన్ని అందిస్తుంది. ఈ టెలివిజన్లలో క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజన్ అమర్చబడి ఉంది. ఇది 400 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్‌ తీసుకొస్తుంది.

ఈ టెలివిజన్లు 1 జిబి ర్యామ్ మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో మీడియాటెక్ MSD 6683 చిప్‌సెట్ ద్వారా పనిచేస్తాయి. ఇవి క్వాడ్-కోర్ ప్రాసెసర్ HDR10 డీకోడింగ్ మరియు HLG ప్రమాణాలకు మద్దతు అందిస్థాయి.

ఈ రియల్మి టీవీలో నాలుగు స్పీకర్లు ఉన్నాయి, ఇవి 24W స్టీరియో సౌండ్‌ను అందిస్తాయి మరియు మెరుగైన సౌండ్ అనుభవాన్ని అందించడానికి Dolby Audio తో ట్యూన్ చేయబడతాయి. ఈ రెండు టీవీలు 5,000 కి పైగా Apps, గూగుల్ అసిస్టెంట్ మరియు క్రోమ్‌కాస్ట్ మద్దతు కలిగి ఆండ్రాయిడ్ టీవీలను ధృవీకరించాయి. ఈ టీవీలలో Netflix, Amazon Prime వీడియో మరియు మరెన్నో యాప్స్ ముందే ఇన్‌స్టాల్ చేయబడ్డాయి.

ఈ రియల్మి టీవీలు Wi-Fi , బ్లూటూత్ 5.0, మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు SPDD ఇన్పుట్, ఈథర్నెట్ పోర్ట్ మరియు మరెన్నో కనెక్టివిటీలను కలిగి ఉంటుంది .

ఈ టీవీ రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో మరియు గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన బటన్లతో ఎర్గోనామిక్ ఫిట్ కోసం నిర్మించిన ప్లాస్టిక్ మరియు కర్వ్ డిజైన్ ఉంది.

ఇక ఈ టీవీ ధరల విషయానికి వస్తే, Realme TV  32-అంగుళాల ధర రూ .12,999 కాగా, Realme TV 43-అంగుళాల ధర 21,999 రూపాయలు. అలాగే, మొదటి సేల్  జూన్ 2 న ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్మి ఇండియా స్టోర్లలో మొదలవుతుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo