Smart Tv: Mi 4A స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్‌కార్ట్‌ ధమాకా అఫర్

HIGHLIGHTS

ఫ్లిప్‌కార్ట్‌ ధమాకా అఫర్

MiTV 4A పైన1500 రూపాయల వరకూ భారీ డిస్కౌంట్

ఈ ఆఫర్ ఆగష్టు 15 వ తేదీ వరకూ మాత్రమే వర్తిస్తుంది

Smart Tv: Mi 4A స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్‌కార్ట్‌ ధమాకా అఫర్

షియోమి ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన MiTV 4A 40 హారిజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్‌కార్ట్‌ ధమాకా అఫర్ ప్రకటించింది.Mi 4A స్మార్ట్ టీవీని సెలెక్టెడ్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ప్రీపేమెంట్ అప్షన్ తో కొనేవారికి రూ.1500 రూపాయల వరకూ భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,000 రూపాయల వరకూ డిస్కౌంట్ EMI పైన 750 రూపాయల తగ్గింపు లభిస్తుంది. ఇవి మాత్రమే కాదు మరిన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పైన కూడా 10% అధనపు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఆగష్టు 15 వ తేదీ వరకూ మాత్రమే వర్తిస్తుంది.  (Check offer here)

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ లేటెస్ట్ Xiaomi స్మార్ట్ టీవీ చాలా సన్నని అంచులతో మరియు చక్కని డిజైన్ తో వచ్చింది. FHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా, రెండు 10W పవర్ ఫుల్ స్పీకర్లతో వుంటుంది.  అంటే, గొప్ప పిక్చర్ క్వాలీటి మరియు పెద్ద సౌండ్ అందించే శక్తితో ఈ టీవీ వుంటుంది. ఈ MiTV 4A 40 హారిజన్ ఎడిషన్ టీవీ యొక్క ధర ఫీచర్లు మరియు ఇతర ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

Mi 4A 40 హారిజన్ ఎడిషన్: Price

MiTV 4A 40 స్మార్ట్ టీవీని షియోమి Rs.24,999 రూపాయల ధరతో ఫ్లిప్‌కార్ట్‌ నుండి లభిస్తోంది.

Mi 4A 40 హారిజన్ ఎడిషన్

ఈ MiTV 4A 40 హారిజన్ ఎడిషన్ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ తో వస్తుంది. అంటే, ఇది మీకు (1980×1080) రిజల్యూషన్ తో పిక్చర్ క్వాలిటీ ఇస్తుంది. అంతేకాదు, 178 డిగ్రీ వ్యూవింగ్ యాంగిల్ తో వస్తుంది మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ టీవీ దాదాపుగా కనిపించని విధంగా సన్నని అంచులతో వుంటుంది. మంచి కలర్స్ అందించగల Vivid Picture Engine ఇందులో వుంది.  

ఈ టీవిలో క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వండింది. ఇక సౌండ్ పరంగా, ఈ టీవీ DTS-HD మరియు Streo రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ లలో రెండు 10×2 స్పీకర్లతో 20W సౌండ్ అందుతుంది.

ఈ షియోమి టీవీలో  మల్టి కనెక్టివిటీ మీకు లభిస్తుంది. ఇందులో, WiFi, Ethernet , 3HDMI, మరియు 2 USB పోర్ట్స్ తో పాటుగా S/PDIF  కూడా వుంది. ఇది  Android 9 మరియు PatchWall OS తో  పనిచేస్తుంది మరియు గూగుల్ అసిస్టెంట్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo