చౌకధరలో పెద్ద సైజు 4K, HDR 10, డాల్బీ విజన్ టీవీలను విడుదల చేసిన kodak : ప్రారంభ ధర Rs.23,999

HIGHLIGHTS

ఇవి చాలా సన్నని అంచులు కలిగి 15 శాతం ఎక్కువ స్క్రీన్ మీకు అందిస్తాయి.

చౌకధరలో పెద్ద సైజు 4K, HDR 10, డాల్బీ విజన్ టీవీలను విడుదల చేసిన kodak : ప్రారంభ ధర Rs.23,999

కోడాక్ ఇండియాలో పెద్ద సైజుగల 4 కొత్త టీవీలను ఇండియాలో విడుదల చేసింది. ఇవి 4 సైజులలో లభిస్తాయి, అవి 43-ఇంచులు (43CA2022), 50 ఇంచులు (Kodak 50CA7077), 55-ఇంచులు (Kodak 55CA0909), 65-ఇంచులు (Kodak 65CA0101) మోడల్ నంబర్లతో వీటిని విడుదల చేసింది. ఇవి వరుసగా, Rs.23,999, Rs.27,999, Rs.30,999 మరియు Rs.49,999 ధరలతో ప్రకటించింది. ఈ టీవీలు Flipkart ఆన్లైన్ ప్లాట్ఫారం పైన మార్చి 19 వ తేది నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటాయని కూడా పేర్కొంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇక ఈ టీవీలను అన్ని కూడా బాక్స్ నుండి బయటకి వస్తూనే Android 9 Pie OS తో పనిచేస్తాయని కంపెనీ తెలియచేసింది. ఇక మరిన్ని ప్రత్యేకతల విషయానికి వస్తే, ఇవి Dolby Vision, HDR 10, మరియు మరింత ఎక్కువ స్టాండర్డ్ అయినటువంటి HLG కవరింగ్ తో ఉంటాయి. అంతేకాదు, ఈ టీవీలు వైడ్ కలర్ గాముట్ తో ఉంటాయి కాబట్టి మరింత విస్తారమైన రంగులను అందిస్తాయి. ఈ టీవీల మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇవి చాలా సన్నని అంచులు కలిగి 15 శాతం ఎక్కువ స్క్రీన్ మీకు అందిస్తాయి. ఆడియో పరంగా, ఈ టీవీలు ఎక్కువ ఆడియో సామర్ధ్యాలను కలిగిస్తో ఉంటాయి. అందులో, DTS మరియు Dolby Digital Plus వంటివి ముఖ్యమైనవి.

ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవీలు ARC, Bluetooth 5.0, USB 3 మరియు HDMI  వంటి వాటి కనెక్టివిటీ సపోర్టుతో వస్తాయి. ఈ టీవీలు 60Hz రిఫ్రెష్ రేటుతో మరియు MEMC తో ఉంటాయి. ఈ టీవీలు కేవలం ఆండ్రాయిడ్ OS పనిచెయ్యడం ఒక్కటి మాత్రమే కాకుండా గూగుల్ అసిస్టెంట్ మరియు అంతర్గత Cromecast తో పాటుగా వస్తాయి. ఇక వీటితో పాటుగా జతగా వచ్చే వాయిస్-ఎనేబుల్ రీమోర్ట్ కంట్రోల్, సులభముగా టీవీని నియంత్రించవచ్చు.                                            

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo