ఇండియాలోని బెస్ట్ 43 ఇంచ్ టాప్-5 స్మార్ట్ టీవీలు (జనవరి 2022)

ఇండియాలోని బెస్ట్ 43 ఇంచ్ టాప్-5 స్మార్ట్ టీవీలు (జనవరి 2022)
HIGHLIGHTS

బెస్ట్ 43 ఇంచ్ టాప్-5 స్మార్ట్ టీవీల లిస్ట్

ప్రతి బడ్జెట్ లో కూడా వాటి స్పెక్స్ మరియు బ్రాండ్ ట్రస్ట్

బెస్ట్ ఫీచర్లు మరియు బెస్ట్ ధర

ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు తమ ఇంటికి తగిన స్మార్ట్ టీవీని ఎంచుకోవడానికి ఆలోచిస్తున్నారు. అయితే, తమ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకొని ఆ పరిధిలోనే సరైన స్మార్ట్ టీవీ కోసం చూస్తున్నారు. అయితే, ప్రతి బడ్జెట్ లో కూడా వాటి స్పెక్స్ మరియు బ్రాండ్ ట్రస్ట్ మరియు ఫీచర్లను బట్టి బెస్ట్ 43 ఇంచ్ టాప్-5 స్మార్ట్ టీవీల లిస్ట్ ను ఈరోజు ఇక్కడ అందించాను.

1. Sony X80J 

ప్రస్తుత ధర : రూ.66,490 

అతిపెద్ద టెక్ దిగ్గజం Sony గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోనీ లేటెస్ట్ తీసుకొచ్చిన Sony X80J 43 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ లేటెస్ట్ Google TV UI పైన నడుస్తుంది. ఈ టీవీ Dolby Vision మరియు Dolby Atmos రెండింటి సపోర్ట్ తో వస్తుంది. ఇది ఆబ్జెక్ట్ ఆధారిత HDR ని ప్రదర్శించడానికి X1 4K HDR ప్రోసెసర్ తో పనిచేస్తుంది. Netflix, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి మరిన్ని యాప్స్ ను కోసం Google Play Store కు యాక్సెస్ వుంది మరియు టీవీ ఎయిర్‌ప్లే 2కి కూడా మద్దతు ఇస్తుంది. టీవిలో అందించిన Alexa ఎనేబుల్ స్మార్ట్ స్పీకర్‌ని ఉపయోగించి టీవీని నియంత్రించవచ్చు. (Buy From Here)

2. Samsung The Frame LS03A

ప్రస్తుత ధర : రూ.58,990 

మీరు మీ టీవీ తో మీ ఇంటిని మరింత కళాత్మకంగా మార్చాలనుకుంటే రెండవ ఆలోచన లేకుండా Samsung యొక్క The Frame LS03A ను చూడవచ్చు. ఈ టీవీని మీరు ఉపయోగించని సమయంలో సాధారణ నల్లని టీవీగా కాకుండా ఒక అంధమైన పిక్చర్ ఫ్రేమ్ గా మారిపోతుంది. అంతేకాదు, ఒక అందమైన పెయింటింగ్ వంటి అనుభూతిని ఇవ్వడానికి తగిన ఫ్రేమ్ తో వస్తుంది. ఇది QLED బ్యాక్‌లైటింగ్ మరియు 4K రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ Samsung యొక్క క్వాంటం ప్రాసెసర్ 4Kని కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ అసిస్టెంట్, Alexa మరియు Bixby కి కూడా సపోర్ట్ చేస్తుంది. (Buy From Here)

3. SAMSUNG Crystal 4K Pro

ప్రస్తుత ధర : రూ.38,999 

సాంసంగ్ నుండి వచ్చిన ఈ 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ అనుభూతిని మరింత మెరుగుపరచాడనికి స్వచ్ఛమైన రంగులను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ UHD పిక్చర్ ప్రాసెసింగ్ కోసం Samsung యొక్క క్రిస్టల్ ప్రాసెసర్ 4K ని కలిగి ఉంది. ఈ సాంసంగ్ స్మార్ట్ టీవీ HDR 10 కి కూడా మద్దతు ఇస్తుంది మరియు ఆడియో పరంగా Samsung యొక్క Q-Symphony కి కూడా మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ టీవీ కూడా గూగుల్ అసిస్టెంట్, Alexa మరియు Bixby కి కూడా సపోర్ట్ చేస్తుంది. అధనంగా,Samsung Galaxy స్మార్ట్‌ ఫోన్‌ ను కలిగి ఉన్న వినియోగదారులు వారి కంటెంట్‌ను టీవీ పైన ప్రతిబింబించేలా ఫోన్‌ను డిస్ప్లేకు ట్యాప్ చేయవచ్చు. (Buy From Here)                   

4. AmazonBasics Fire TV Edition AB4 

ప్రస్తుత ధర : రూ.30,999 

AmazonBasics Fire TV ఎడిషన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు 4K రిజల్యూషన్ తో వస్తుంది. అలాగే, మీ కనెక్టివిటీ అవసరాల కోసం ఈ టీవీ 3 HDMI పోర్ట్‌లు మరియు 2 USB పోర్ట్‌ లతో వస్తుంది. ఈ టీవీ Fire TV OS పైన నడుస్తుంది మరియు Fire TV స్టిక్‌ ని కనెక్ట్ చేయకుండానే Fire TV UI ని ఈ టీవీ అందిస్తుంది. ఇందులో YouTube, Prime Video, Netflix, Disney+ Hotstar, Zee5, SonyLiv మరియు మరిన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Dolby Vision మరియు Dolby Atmos రెండిటికి సపోర్ట్ చేస్తుంది. (Buy From Here)

5.TCL 43P715

ప్రస్తుత ధర : రూ.34,999

ఈ TCL 43P715 స్మార్ట్ టీవీ HDR కి సపోర్ట్ కలిగిన 43-అంగుళాల 4K టీవీ. ఈ స్మార్ట్ టీవీ Android TV UI పైన నడుస్తుంది మరియు దానితో పాటు Google Play Store కోసం మద్దతును అందిస్తుంది. ఈ టీవీ 30 W పవర్ స్పీకర్స్ మరియు Dolby Audio సపోర్ట్ తో వస్తుంది. ఇది హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ నియంత్రణలను కూడా కలిగి ఉంది మరియు మైక్రో డిమ్మింగ్ తో వస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు మరిన్నింటి వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సర్వీసులను నేరుగా టీవీలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. (Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo