ఇండియాలో 120-ఇంచ్ లార్జ్ 4K స్మార్ట్ లేజర్ టీవీ ఆవిష్కరించిన Hisense

HIGHLIGHTS

Hisense ఇండియాలో అతిపెద్ద 120-ఇంచ్ లార్జ్ 4K స్మార్ట్ లేజర్ టీవీ ఆవిష్కరించింది

ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రీమియం 120” 4K స్మార్ట్ లేజర్ టీవీ

ఈ Hisense 4K స్మార్ట్ లేజర్ టీవీలో రంగులు చాలా రియల్ మరియు నేచురల్ గా ఉంటాయని కంపెనీ తెలిపింది

ఇండియాలో 120-ఇంచ్ లార్జ్ 4K స్మార్ట్ లేజర్ టీవీ ఆవిష్కరించిన Hisense

Hisense ఇండియాలో అతిపెద్ద 120-ఇంచ్ లార్జ్ 4K స్మార్ట్ లేజర్ టీవీ ఆవిష్కరించింది. అదే, 120L9G స్మార్ట్ లేజర్ టీవీ మరియు ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రీమియం 120” 4K స్మార్ట్ లేజర్ టీవీ. ఈ అతిపెద్ద ALR స్క్రీన్ 120 అంగుళాలు పరిమాణంలో, 3000 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్ తో పాటుగా 4K UHD పిక్చర్ క్వాలిటీతో వస్తుంది. ఈ Hisense 4K స్మార్ట్ లేజర్ టీవీలో రంగులు చాలా రియల్ మరియు నేచురల్ గా ఉంటాయని కంపెనీ తెలిపింది. హైసెన్స్ సరికొత్తగా తీసుకొచ్చిన ఈ 4K స్మార్ట్ లేజర్ టీవీ యొక్క ధర మరియు ప్రత్యేకతలను వివరంగా తెలుసుకుందాం.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ Hisense 120L9G 4K స్మార్ట్ లేజర్ టీవీ సినిమా హాలు వాటి అతిపెద్ద 120 ఇంచ్ సైజు స్క్రీన్ అందిస్తుంది. ఈ లేజర్ టీవీని Hisense రూ. 499,999 రూపాయల ధరతో ప్రకటించింది మరియు ఈ టీవీ జూలై 6 నుండి, అంటే ఈరోజు నుండి అమెజాన్ నుండి అందుబాటులో వుంది. ఈ టీవీ పైన లాంచ్ అఫర్ లో భాగంగా 3 సంవత్సరాల కాంప్రహెన్సివ్ వారెంటీని మరియు 4K Fire TV స్టిక్ మ్యాక్స్ ను కూడా హైసెన్స్ అందించింది.

ఈ 4K స్మార్ట్ లేజర్ టీవీ HDR 10 మరియు HLG సపోర్ట్ మరియు MEMC తో పాటుగా వైడ్ కలర్ గ్యాముట్ (NTSC 145%) తో వస్తుంది. కనెక్టివిటీ పరంగా, ఒక Arc తో సహా 3 HMDI 2.0 పోర్ట్, 2 USB పోర్ట్స్, 1S/PDIF మరియు ఇన్ బిల్ట్ 5G Wi-Fi వంటి మల్టీ కనెక్టివిటీ అప్షన్లతో వస్తుంది. ఈ లేజర్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 40 హెవీ సౌండ్ స్పీకర్ సిస్టం ను కూడా కలిగి వుంది. ఇది VIDAA ఆపరేటింగ్ సిస్టం పైన పనిచేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo