టీవీల దిగుమతిపై కొత్త షరతులు విధించిన భారత ప్రభుత్వం : లోకల్ టీవీ లకు పెద్ద పీఠ

టీవీల దిగుమతిపై కొత్త షరతులు విధించిన భారత ప్రభుత్వం : లోకల్ టీవీ లకు పెద్ద పీఠ
HIGHLIGHTS

భారతదేశంలో టీవీల Local తయారీని పెంచడానికి ఈ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

భారతదేశంలో టీవీల దిగుమతి విధానాన్ని “ఉచిత” నుండి “రిస్ట్రికేడ్” గా మారుస్తుంది.

గడిచిన సంవత్సరంలో భారతదేశం 781 మిలియన్ డాలర్ల విలువైన టీవీలను దిగుమతి చేసుకుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫోరిన్ ట్రేడ్ (DGFT) భారతదేశంలో కలర్ టివిల దిగుమతిపై పరిమితిని ప్రకటించింది. అంటే, ఇప్పటి వరకూ దిగుమతి ఉచితంగా ఉండగా దీని రిస్ట్రికేడ్ కి మార్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే,  భారతదేశంలో టీవీల దిగుమతి విధానాన్ని “ఉచిత” నుండి “రిస్ట్రికేడ్” గా మారుస్తుంది.

కలర్ టీవీల దిగుమతిపై భారత ప్రభుత్వం పరిమితి విధించింది

టీవీ మార్కెట్ విషయానికి వస్తే, మార్చి 31, 2020 తో ముగిసిన సంవత్సరంలో భారతదేశం 781 మిలియన్ డాలర్ల విలువైన టీవీలను దిగుమతి చేసుకుంది. వియత్నాం నుండి 400 మిలియన్ డాలర్ల విలువైన టీవీలను దిగుమతి చేసుకున్నారు మరియు చైనా నుండి దాదాపు 300 మిలియన్ల విలువైన టీవీలను దిగుమతి చేసుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ ప్రకారం, "దేశంలో విక్రయించే టీవీ సెట్లలో 35% దిగుమతి అవుతున్నాయి".

అయితే, ఇప్పుడు కొత్తగా ప్రకటించిన విధానం ద్వారా టీవీల దిగుమతిని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది కాలమే తెలియజేస్తుంది. భారతదేశంలో టీవీల స్థానిక తయారీని పెంచడానికి ఈ యాక్షన్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశంలో తమ ఉత్పత్తులను విక్రయించే అనేక టీవీ బ్రాండ్స్ తో Digit చేసిన సమీక్షలో వారు తెలిపిన వివరాలు, ఈ క్రింది విధంగా ఉన్నాయి.

సోనీ ఇండియా సేల్స్ హెడ్ సతీష్ పద్మనాభన్ మాట్లాడుతూ “2015 నుండి స్థానిక టెలివిజన్ల తయారీని భారతదేశానికి మార్చడానికి సోనీ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుతం, మేము భారతదేశంలో 99% బ్రావియా టెలివిజన్లను విజయవంతంగా తయారు చేస్తున్నాము మరియు ఉత్పత్తి నాణ్యతతో మేము చాలా సంతృప్తి చెందాము ఇది ప్రపంచ ప్రమాణాలకు సమానంగా ఉంటుంది మరియు మన భారతీయ వినియోగదారుకు బాగా నచ్చినవిగా కూడా ఎంచబడ్డాయి. మాకు ప్రభుత్వంపై నమ్మకం ఉంది మరియు ఈ దశ స్వావలంబన కోసం భారతదేశ ప్రయాణానికి సరైన వేగాన్ని పెంచింది. ” అని తెలిపారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo