సేల్ చివరి సమయంలో భారీ Samsung 4K Smart Tv ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!
ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది
చివరి సమయంలో Samsung 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది
శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది
దీపావళి పండుగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళి సేల్ ఈ రోజు అర్ధరాత్రి తో ముగుస్తుంది. అందుకే కాబోలు చివరి సమయంలో Samsung 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. మార్కెట్లో ఇటీవల శాంసంగ్ విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఈ బిగ్ డీల్స్ అందించింది ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ బిగ్ డీల్ తో శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ కేవలం 24 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అందుకే, ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఈరోజు ప్రత్యేకంగా అందిస్తున్నాము.
Surveyఏమిటా Samsung 4K Smart Tv డీల్?
శాంసంగ్ రీసెంట్ గా ఇండియాలో విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ Crystal 4K Vista పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే నుంచి ఈ స్మార్ట్ టీవీ పై 34% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 25,990 ధరకే సేల్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని SBI క్రెడిట్ కార్డు EMI ఆఫర్ తీసుకున్న వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 24,490 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. వాస్తవానికి, ప్రభుత్వం ప్రకటించిన GST కూడా ఈ టీవీ రేటు తగ్గడానికి కారణం అయ్యింది.
Also Read: మరికొన్ని గంటల్లో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ సేల్ లాస్ట్ డే iPhone 16 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Samsung 4K Smart Tv : ఫీచర్స్
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ LED ప్యానల్ ని 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+, PurColor మరియు మోషన్ ఎక్సిలరేటర్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ Crystal Processor 4K ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 4K అప్ స్కేలింగ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ స్లిమ్ లుక్ డిజైన్ మరియు బౌండ్ లెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది.

సౌండ్ పరంగా, ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్ ఫీచర్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ Q-Symphony మరియు అడాప్టివ్ సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ మరియు యూట్యూబ్ క్విక్ యాక్సెస్ కోసం హాట్ కీ కలిగిన ఫుల్ ఫంక్షన్ రిమోట్ తో కూడా వస్తుంది.