Flipkart Sale: ఫ్లిప్ కార్ట్ ఈరోజు నుంచి మొదలు పెట్టిన ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ జాక్ పాట్ డేస్ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ అందించింది. TCL సబ్ బ్రాండ్ iFFALCON ఇండియాలో కొత్తగా విడుదల చేసిన క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో కొత్త క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం 19 వేల ధరలో లభిస్తుంది.
Survey
✅ Thank you for completing the survey!
Flipkart Sale: ఆఫర్
ఫ్లిప్ కార్ట్ ఫ్లాగ్ షిప్ జాక్ పాట్ డేస్ సేల్ ఈరోజు (ఆగస్టు 13) నుంచి మొదలయ్యింది మరియు ఆగస్టు 15 వరకు నడుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, TCL సబ్ బ్రాండ్ అయిన ఐఫాల్కన్ యొక్క లేటెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ iFF43Q73 ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 65% భారీ డిస్కౌంట్ తో రూ. 29,990 ధరకే లభిస్తోంది.
ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీని HSBC, IDFC FIRST మరియు AU Credit కార్డ్స్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ స్మార్ట్ టీవీ ని 19 వేల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేసే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
ఇఫాల్కన్ యొక్క ఈ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ AiPQ ఇంజిన్ 3.0 తో వస్తుంది. ఈటీవీ Dolby Vision మరియు HDR 10+ సపోర్ట్ తో పాటు క్యూలెడ్ స్క్రీన్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సపోర్ట్ మరియు dtsX సపోర్ట్ లతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో 30W సోయిన్డ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి.
ఈ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ చాలా సన్నని అంచులతో చూడ చక్కని డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ ధరలో లభించే బడ్జెట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలుస్తుంది.