VIVO X200T: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో విడుదలైన వివో కొత్త ఫోన్.!

HIGHLIGHTS

వివో ఈరోజు ఎక్స్ 200 టి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు 50MP ట్రిపుల్ పవర్ ఫుల్ కెమెరా సెటప్ తో వచ్చింది

వివో ఎక్స్ 200 టి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది

VIVO X200T: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో విడుదలైన వివో కొత్త ఫోన్.!

vivo X200T: వివో ఈరోజు ఎక్స్ 200 టి స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను మూడు 50MP ట్రిపుల్ పవర్ ఫుల్ కెమెరా సెటప్ మరియు పవర్ ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్ వంటి మరిన్ని ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర మరియు కంప్లీట్ ఫీచర్స్ వివరంగా తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

VIVO X200T : ప్రైస్

వివో ఎక్స్ 200 టి స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. ఇందులో 12 జీబీ + 256 జీబీ బేసిక్ వేరియంట్ ను రూ. 59,999 ప్రైస్ ట్యాగ్ తో మరియు ఈ ఫోన్ 12 జీబీ + 512 జీబీ హై ఎండ్ వేరియంట్ ను రూ. 69,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అంది అందించింది. ఈ ఫోన్ సీసైడ్ లీలాక్ మరియు స్టెల్లార్ బ్లాక్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్ :

ఈ స్మార్ట్ ఫోన్ పై రెండు భారీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్స్ ను వివో అందించింది. ఈ ఫోన్ పై రూ. 5000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ మరియు రూ. 5,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను వివో అందించింది. ఈ ఫోన్ ను Axis, HDFC మరియు SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది.

VIVO X200T : ఫీచర్స్

ఈ వివో ఎక్స్ 200 టి ఫోన్ లో FHD+ రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.67 ఇంచ్ AMOLED డిస్‌ప్లే వుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు HDR10+ సపోర్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను మీడియాటెక్ Dimensity 9400+ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది 3nm ప్రాసెసర్ మరియు మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ వేగవంతమైన 12 జీబీ LPDDR5X ర్యామ్ మరియు 512GB స్టోరేజ్ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ కలర్ OS తో Android 16 పై పని చేస్తుంది.

VIVO X200T Price and features

ఈ ఫోన్ లో జబర్దస్త్ కెమెరా సెటప్ వుంది. ఇందులో వెనుక ZEISS T లెన్స్ కోటింగ్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇందులో 50MP Sony IMX 921 మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ లు ఉన్నాయి. ఈ ఫోన్ 60 FPS వద్ద 4K వీడియో రికార్డింగ్ ఆఫర్ చేస్తుంది మరియు గొప్ప Ai కెమెరా ఫీచర్స్ కూడా కలిగివుంది. అలాగే, లేటెస్ట్ వివో ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని కూడా వివో అందించింది.

Also Read: BSNL Republic Day offer: అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో కొత్త ప్లాన్ లాంచ్.!

ఈ వివో లేటెస్ట్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కలిగి ఉంటుంది మరియు ఇంత స్లీక్ డిజైన్ లో కూడా 6200 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది. ఈ ఫోన్ లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వివో అందించింది. ఈ ఫోన్ లో 3D అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP68 అండ్ IP69 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా వంటి ప్రీమియం అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ 5 సంవత్సరాల OS అప్గ్రేడ్ మరియు 7 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo