Oppo F27 5G : పెద్ద రింగ్ లైట్ తో సరికొత్త డిజైన్ లో వస్తున్న ఒప్పో కొత్త ఫోన్.!
ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది
Oppo F27 5G డిజైన్ తో అందించిన కొత్త టీజింగ్ ఇమేజ్ ద్వారా హైప్ పెంచింది
ఒప్పో F27 5జి కెమెరా బంప్ చుట్టూ ఒక పెద్ద రింగ్ లైట్ ను కలిగి వుంది
Oppo F27 5G : ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ గురించి కంపెనీ టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ డిజైన్ తో అందించిన కొత్త టీజింగ్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ పైన ఒప్పో హైప్ పెంచింది. ఎందుకంటే, ఒప్పో అప్ కమింగ్ ఫోన్ ఒప్పో F27 5జి కెమెరా బంప్ చుట్టూ ఒక పెద్ద రింగ్ లైట్ ను కలిగి వుంది. చూడటానికి ఈ కొత్త ఫోన్ ను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది ఈ కొత్త రింగ్ లైట్.
SurveyOppo F27 5G ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఒప్పో F27 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఒప్పో ఇంకా ప్రకటించించలేదు. ‘Coming Soon’ అని ఈ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించింది మరియు కంపెనీ అధికార X (ట్విట్టర్) అకౌంట్ ను నుంచి ఈ ఫోన్ టీజర్ ఫోటో ను విడుదల విడుదల చేసింది.
OPPO F27 5G – A flaunt-worthy design is on its way! #StayTuned #DareToFlaunt #OPPOF275G pic.twitter.com/nkHaiyv2hb
— OPPO India (@OPPOIndia) August 12, 2024
Oppo F27 5G : డిజైన్ మరియు ఫీచర్లు
ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ యొక్క వివరాలు ప్రస్తుతానికి బయట పెట్టలేదు. కానీ ఈ అప్ కమింగ్ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా కెమెరా మరియు డిజైన్ వివరాలు తెలుస్తున్నాయి. ఒప్పో ఈ F27 5G
ఫోన్ ను డ్యూయల్ రియర్ కెమెరా జత LED ఫ్లాష్ కూడా ఉంటుంది. ఈ కెమెరా సెటప్ రౌండ్ బంప్ తో వస్తుంది మరియు ఈ బంప్ చుట్టూ పెద్ద రింగ్ లైట్ ను అందించింది. ఈ రింగ్ లైట్ ఫోన్ కు కొత్త అట్రాక్షన్ గా నిలుస్తుంది.

ఈ ఫోన్ డిజైన్ పరంగా రౌండ్ కార్నర్ లు మరియు కర్వుడ్ బ్యాక్ ప్యానల్ తో స్లీక్ గా ఈ ఫోన్ స్లీక్ గా ఉన్నట్లు చూపిస్తుంది. ఇది మాత్రమే కాదు ఒప్పో F27 సిరీస్ నుంచి ముందుగా వచ్చిన ప్రీమియం ఫోన్ F27 Pro+ 5G మాదిరిగా ఈ ఫోన్ కూడా కర్వుడ్ డిస్ప్లే ను కలిగి ఉంటుంది కొందరు భావిస్తున్నారు. అయితే, ఇది ఈ సిరీస్ లో వచ్చే బడ్జెట్ ఫోన్ కాబట్టి ఫ్లాట్ స్క్రీన్ తో వస్తుందని మేము అంచనా వేస్తున్నాము.
Also Read: iQOO Z9s Pro: 4K OIS వీడియో కెమెరా మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
ఈ ఫోన్ లాంచ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ఈ ఫోన్ లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్ యొక్క కీలక వివరాలు కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.