Realme Buds Clip: రోజు మొత్తం ధరించినా ఇబ్బంది పెట్టని కొత్త బడ్స్ వస్తున్నాయి.!
రియల్ మీ అప్ కమింగ్ ఫోన్ రియల్ మీ పి4 పవర్ తో పాటు ఈ బడ్స్ కూడా లాంచ్ చేస్తుంది
Realme Buds Clip రోజు మొత్తం చెవిలో పెట్టుకున్న ఇబ్బంది పెట్టని కొత్త ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ తో వస్తున్నాయి
గొప్ప బాస్ సౌండ్ అందించే అల్గారిథం కూడా కలిగి ఉంటుంది
Realme Buds Clip: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ పి4 పవర్ తో పాటు ఈ బడ్స్ కూడా లాంచ్ చేస్తుంది. రోజు మొత్తం చెవిలో పెట్టుకున్నా ఇబ్బంది పెట్టని కొత్త ఓపెన్ ఇయర్ క్లిప్ డిజైన్ తో ఈ బడ్స్ ను లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. అంతేకాదు, ఈ బడ్స్ చాలా తేలికగా ఉంటాయి మరియు గొప్ప బాస్ సౌండ్ అందించే అల్గారిథం కూడా కలిగి ఉంటుంది.
SurveyRealme Buds Clip: లాంచ్ డేట్?
ఈ రియల్ మీ బడ్స్ ఇయర్ బడ్స్ ను రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ ఇయర్ బడ్స్ చెవులకు గొప్ప సౌకర్యవంతమైన గొప్ప ఫిట్ డిజైన్ కలిగి ఉంటుంది.
Realme Buds Clip: ఫీచర్స్
రియల్ మీ బడ్స్ ఇయర్ బడ్స్ టైటానియం ఫిట్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇది కేవలం 5.3 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఈ బడ్స్ చెవుల లోపల ఫిట్ అయ్యే డిజైన్ కాకుండా చెవుల పై నుంచి ధరించే ఓపెన్ ఇయర్ ఫిట్ డిజైన్ తో ఉంటుంది. అదే క్లిప్ డైజిన్ మరియు ఈ డిజైన్ తో ఇది గొప్ప ఫిట్ అండ్ గుడ్ ఫీల్ కూడా ఇస్తుంది.
ఇందులో 11mm డ్యూయల్ మ్యాగ్నెట్ లార్జ్ డ్రైవర్ ఉంటాయి. ఇది గొప్ప బాస్ సౌండ్ ను వెలుపల అందించే విధంగా ఉంటుంది. ఇది 85 dB వరకు ఫుల్ డివైజ్ సౌండ్ ప్రెజర్ అందిస్తుంది. ఇది మాత్రమే కాదు 100% లో-ఫ్రీక్వెన్సీ సౌండ్ ప్రెజర్ బూస్ట్ కూడా అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఇదే కాదు బాస్ బూస్ట్ మరియు స్పష్టమైన మిడ్/హై స్కేల్ కోసం రియల్ మీ యొక్క ప్రత్యేకమైన ఆడియో ట్యూనింగ్ NextBass Algorithm కూడా కలిగి ఉంటుంది.

అదనంగా, 3D స్పేషియల్ ఆడియో మరియు డైరెక్షనల్ సౌండ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ USB Type-C ఛార్జింగ్ పోర్ట్ తో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది బ్లూటూత్ 5.4 తో స్ట్రాంగ్ కనెక్షన్ మరియు స్థిరమైన ట్రాన్స్ మిషన్ తో ఉంటుంది. ఇది ఒకేసారి రెండు డివైస్‌లతో కనెక్ట్ అయ్యే డ్యూయల్ డివైజ్ కనెక్షన్ మరియు ల్యాప్ టాప్‌లతో వేగంగా స్విచ్ అయ్యే స్విఫ్ట్ పెయిర్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: BSNL Super offer: మరో మూడు రోజుల్లో ముగియనున్న ఉచిత డేటా ఆఫర్ మిస్ చేసుకోకండి.!
ఈ బడ్స్ లో Ai డ్యూయల్ మైక్ ENC సపోర్ట్ అందించింది. ఇది కాలింగ్ సమయంలో క్లియర్ వాయిస్ అందించడానికి మంచి ఫీచర్ అవుతుంది. ఈ బడ్స్ AI ట్రాన్స్‌లేటర్ సపోర్ట్ కూడా కలిగి వుంది. ఇది టోటల్ ఛార్జ్ తో 36 గంటల ప్లే టైం ఆఫర్ చేస్తుంది. ఈ బడ్స్ IP55 రేటింగ్ తో ఈ బడ్స్ డస్ట్ మరియు తేలికపాటి నీటి స్ప్లాష్ కి నిరోధకంగా ఉంటుంది.