Redmi Note 15 Pro Price ఆన్లైన్ లో లీకయ్యింది.. లాంచ్ కంటే ముందే ప్రైస్ తెలుసుకోండి.!
Redmi Note 15 Pro Price ఈరోజు ఆన్‌లైన్ లో లీకయ్యింది
200MP డ్యూయల్ కెమెరా మరియు 6580 mAh పెద్ద బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తుంది
ఈ ఫోన్ ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది
Redmi Note 15 Pro Price ఈరోజు ఆన్‌లైన్ లో లీకయ్యింది. ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంచ్ అవుతుండగా, ఈరోజు ఈ ఫోన్ ప్రైస్ ఆన్‌లైన్ లీకయ్యింది. రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క లీక్డ్ ప్రైస్ చూస్తుంటే, ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు అర్థం అవుతుంది. ఈ ఫోన్ ను డాల్బీ విజన్ స్క్రీన్, 200MP డ్యూయల్ కెమెరా మరియు 6580 mAh పెద్ద బ్యాటరీ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ చేస్తుంది.
SurveyRedmi Note 15 Pro Price: లీక్ అయిన ప్రైస్ ఏమిటి?
రెడ్ మీ నోట్ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్స్ లో లాంచ్ చేస్తున్నట్లు కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ మూడు వేరియంట్ లీక్డ్ ప్రైస్ ను ఇప్పుడు చూద్దాం. ఈ ఫోన్ బేసిక్ (8GB + 128GB) వేరియంట్ ను రూ. 30,999 (లీక్ ప్రైస్) ధరతో మరియు (8GB + 256GB) వేరియంట్ ను రూ. 32,999 (లీక్ ప్రైస్) ధరతో లాంచ్ చేసే అవకాశం ఉందని కొత్త లీక్స్ చెబుతున్నాయి. ఈ ఫోన్ ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే కంపెనీ స్టార్ట్ చేసింది మరియు ఈ ప్రీ బుకింగ్ నుంచి గొప్ప ఆఫర్స్ కూడా ఈ ఫోన్ పై అందించింది.

పైన తెలిపిన ధరలు రూమర్ అండ్ లీక్డ్ ప్రైస్ గా మాత్రమే మనం చూడాలి. అంతేకాదు, కంపెనీ అఫీషియల్ గా ఈ ఫోన్ ప్రైస్ వెల్లడించే వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉంది మరియు కేవలం రూ. 1,999 చెల్లించి ఈ ఫోన్ ను ప్రీ బుక్ చేసుకోవచ్చు.
Also Read: ఆన్లైన్ లో లీకైన నథింగ్ అప్ కమింగ్ ఫోన్ Nothing Phone 4a Pro వివరాలు.!
Redmi Note 15 Pro : ఫీచర్స్
కంపెనీ ఈ ఫోన్ యొక్క కంప్లీట్ ఫీచర్స్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ ఫోన్ ను గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ కలిగిన 6.83 అంగుళాల AMOLED స్క్రీన్ తో లాంచ్ చేస్తుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra (4nm) ప్రాసెసర్ తో లాంచ్ అవుతుంది. ఇందులో 8 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటాయి.
ఈ షియోమీ స్మార్ట్ ఫోన్ 200 MP ప్రైమరీ కెమెరా మరియు 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 20 MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6580 mAh పెద్ద బ్యాటరీ వుంది మరియు ఈ ఫోన్ లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ తో పాటు 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను IP66, 68, 69, మరియు 69K రేటింగ్ తో ఇండస్ట్రీ లీడింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫోన్ గా అందిస్తుంది.