ఆన్లైన్ లో లీకైన నథింగ్ అప్ కమింగ్ ఫోన్ Nothing Phone 4a Pro వివరాలు.!
Nothing Phone 4a Pro లీక్స్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి
ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కి ముందే ఈ ఫోన్ లీక్ డీటెయిల్స్ అందిస్తున్నాయి
స్పెసిఫికేషన్ గురించిన రూమర్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి
Nothing Phone 4a Pro ఫోన్ లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. ఈ ఫోన్ గురించి కొన్ని లీక్స్ మాత్రం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అంటే, ఈ ఫోన్ అధికారిక లాంచ్‌కి ముందే ఈ ఫోన్ లీక్ డీటెయిల్స్ ఈ ఫోన్ గురించి ఒక అవగాహన అందించే విధంగా ఉన్నాయి.ఈ ఫోన్ సర్టిఫికేషన్ మరియు స్పెసిఫికేషన్ గురించిన రూమర్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
SurveyNothing Phone 4a Pro లీక్డ్ డీటెయిల్స్?
నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్ ఫోన్ మోడల్ యూరోపియన్ EPREL సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించినట్లు చెబుతున్నారు. ఈ కొత్త మోడల్ ఫోన్ ను 5,080mAh బిగ్ బ్యాటరీ మరియు 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది. అంటే, ఇప్పటి వరకు నథింగ్ అందించిన ఫోన్స్ కలిగిన బ్యాటరీ కంటే కొంచెం శక్తివంతమైన బ్యాటరీ తో ఈ ఉన్నట్లు చూడవచ్చు. అయితే, ఇదేదో పెద్ద తేడా అనుకోకండి, అంత పెద్ద మార్పు ఏమీ కాదు. ఇదే EPREL లిస్టింగ్ లో ఈ ఫోన్ బ్యాటరీ 1,400 ఛార్జ్ సైకిల్స్ కంటే ఎక్కువ కాలానికి కూడా 80% బ్యాటరీ సామర్థ్యం నిలిచి ఉంటుందని కూడా తెలిపింది. అంటే, దీర్ఘకాలిక ఉపయోగంలో బ్యాటరీ డి గ్రేడేషన్ తక్కువగా ఉంటుందని కంపెనీ చెప్పే ప్రయత్నం చేసింది.
ఈ నథింగ్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ Snapdragon 7 సిరీస్ చిప్ సెట్ ఉండే అవకాశం ఉందని కూడా కొత్త లిక్స్ సూచిస్తున్నాయి. అంతేకాదు, ఈ కొత్త లీక్ ప్రకారం ఈ ఫోన్ లో 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వంటి అధిక పెర్ఫార్మెన్స్ వివరాలు జోడించే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తోంది. కంపెనీ 4a ప్రో వేరియంట్ గురించి చెబుతోందంటే సాధారణ 4a వెర్షన్ కూడా ఈ సెగ్మెంట్ నుంచి అందించే అవకాశం ఉందని మనం ఊహించవచ్చు.
Also Read: Realme P4 Power ఫోన్ కాదు పవర్ బ్యాంక్ : ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!
ఈ ఫోన్ యొక్క లీకైన సర్టిఫికేషన్ ప్రకారం ఈ ఫోన్ IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్ కూడా పొందినట్లు తెలుస్తోంది. ఇది రోజువారీ వాటర్ స్ప్లాష్ లేదా తేలికపాటి వర్షం నుంచి రక్షణ ఇస్తుంది. ఈ ఫోన్ 2026 Q1 లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా అంచనా వేసి చెబుతున్నారు. మరి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి అఫీషియల్ డిటైల్స్ ఎప్పటి వరకు బయటకు వస్తాయో చూడాలి.

ఇది ఇలా ఉంటే నథింగ్ తన అఫీషియల్ స్టోర్ ను కూడా ఇండియాలో ఓపెన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. భారత్ లో ముందు బెంగుళూరు సిటీలో నథింగ్ స్టోర్ ఓపెన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అయితే, ఈ స్టోర్ ఓపెనింగ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ స్టోర్ ను త్వరలో ఓపెన్ చేస్తుంది.