Realme P4 Power ఫోన్ కాదు పవర్ బ్యాంక్ : ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

Realme P4 Power స్మార్ట్ ఫోన్ ఫోన్ కాదు పవర్ బ్యాంక్ అని చెప్పవచ్చు

ఈ ఫోన్ ను ఏకంగా 10,001 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది

ఈ ఫోన్ కలిగిన టాప్ 5 ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా

Realme P4 Power ఫోన్ కాదు పవర్ బ్యాంక్ : ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ తెలుసుకోండి.!

Realme P4 Power స్మార్ట్ ఫోన్ ఫోన్ కాదు పవర్ బ్యాంక్ అని చమత్కారంగా చెప్పవచ్చు. ఎందుకంటే, రియల్‌మీ ఈ ఫోన్ ను ఏకంగా 10,001 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తుంది. కేవలం బ్యాటరీ మాత్రమే కాదు ఈ ఫోన్ వేగవంతమైన చిప్ సెట్ మరియు అద్భుతమైన విజువల్స్ అందించే డిస్ప్లే కూడా కలిగి ఉంటుంది. మరి ఈ ఫోన్ కలిగిన టాప్ 5 ఫీచర్స్ ఏమిటో తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme P4 Power : లాంచ్ డేట్ ఏమిటి?

రియల్‌మీ పి4 పవర్ స్మార్ట్ ఫోన్ జనవరి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ మూడు సరికొత్త రంగుల్లో కూడా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ టాప్ 5 ఫీచర్స్ ఈరోజు తెలుసుకోండి.

Realme P4 Power : టాప్ 5 ఫీచర్స్

డిజైన్

ఈ అప్ కమింగ్ రియల్‌మీ స్మార్ట్ ఫోన్ అతిపెద్ద బ్యాటరీ కలిగి ఉన్నా కూడా చాలా స్లీక్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఇది ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్ మరియు ట్రాన్స్ బ్లూ అనే మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది.

డిస్ప్లే

ఈ ఫోన్ లో బిగ్ 4D కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ తో పాటు HDR 10+ సపోర్ట్ మరియు Netflix HDR సపోర్ట్ తో కూడా వస్తుంది. ఇది స్టన్నింగ్ విజువల్స్ అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్

ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7400 Ultra చిప్ సెట్ జతగా హైపర్ విజన్ ప్లస్ AI చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఈ సెటప్ తో గొప్ప విజువల్స్ తో కూడిన గేమింగ్ అందిస్తుంది.

Also Read: JBL 5.1 Dolby Atmos సౌండ్ బార్ అమెజాన్ పై బిగ్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుకోండి.!

కెమెరా

ఈ ఫోన్ వెనుక 50MP Sony IMX 882 ప్రధాన కెమెరా జతగా మరో రెండు కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో 4K వీడియో రికార్డింగ్, గొప్ప ఫోటోలు మరియు మంచి జూమ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

బ్యాటరీ

భారత మార్కెట్ ఎప్పుడు చూడని 10,001 mAh బిగ్ బ్యాటరీ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 80W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ మరియు ఈ ఫోన్ తో ఇతర డివైజెస్ ను ఛార్జ్ చేసే 27W ఫాస్ట్ రివర్స్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo