కేవలం రూ.6,999 ధరలో కొత్త 32 ఇంచ్ LED టీవీ ని లాంచ్ చేసిన Detel

HIGHLIGHTS

ఈ డీటేల్ 32 అంగుళాల LED టీవీ Dolby Digital సౌండ్ టెక్నలాజితో వస్తుంది

కేవలం రూ.6,999 ధరలో కొత్త 32 ఇంచ్ LED టీవీ ని లాంచ్ చేసిన  Detel

దీపావళి సందర్భంగా, డీటేల్ కేవలం బడ్జెట్ ధరలోతన కొత్త 32 అంగుళాల LED టీవీని  ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు లాంచ్ చేసిన ఈ LED టీవీ  HD రెడీ పిక్సెల్ రిజల్యూషన్,  A+ గ్రేడ్ ప్యానల్ మరియు రెండు 10 వాట్స్ స్పీకర్లతో వస్తాయి. అంటే, మంచి పిక్చెర్ క్వాలిటీతో పాటుగా పెద్ద సౌండ్ అందించగల స్పీకర్లతో ఈ కొత్త LED టీవీలను తీసుకొచ్చింది.   

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఈ కొత్త  HD Ready LED టీవీలో మంచి సౌండ్ టెక్నలాజితో కూడా అందించింది. ఎందుకంటే, ఈ డీటేల్ 32 అంగుళాల LED టీవీ Dolby Digital సౌండ్ టెక్నలాజితో వస్తుంది. అలాగే, ఇది A+ గ్రేడ్ ప్యానల్ తో వస్తుంది మరియు 3,00,00:1 కాంట్రాస్ట్ రేషియోని కూడా అందిస్తుంది. ఈ LED టీవీ HDMI మరియు USB పోర్ట్స్ వాటి కనెక్టివిటీలతో వస్తుంది. అంతేకాదు, ఈ టీవీ ప్రీ లోడెడ్ గేమ్స్ మరియు పవర్ ఆడియో కంట్రోల్ తో పాటుగా PC కనెక్టవిటీ తో వస్తుంది.

సంస్థ యొక్క ఫౌండర్ మరియు CEO అయినటువంటి, యోగేష్ భాటియా,  ఈ LED లాంచ్ సమయంలో దీన్ని గురించి మాట్లడుతూ, కేవలం రూ.3,999 రూపాయల ధరలో ముందుగా తీసుకొచ్చినటువంటి 17 అంగుళాల LED పైన వినియోగదారుల స్పందనను అనుసరించి, ఈ 32 అంగుళాల LED టీవీని తీసుకొచ్చాము. అదికూడా, వారి బడ్జెట్ లో తగిన ఫీచర్లతో ఈ టీవీని తెచ్చినట్లుగా చెప్పారు. ఈ టీవీ ఇప్పుడు మర్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.                       

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo