బడ్జెట్ ధరలో 60W హెవీ సౌండ్ తో వచ్చిన కొత్త 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ

HIGHLIGHTS

Blaupunkt (50) inch 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంచ్

60W హెవీ సౌండ్ అవుట్ పుట్

Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీ

బడ్జెట్ ధరలో 60W హెవీ సౌండ్ తో వచ్చిన కొత్త 50 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ

జర్మన్ ఎలక్ట్రానిక్స్ కంపనీ Blaupunkt ఇండియాలో తన కొత్త స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ సైజుతో 4K UHD రిజల్యూషన్ ఆండ్రాయిడ్ టీవీ. ఈ లేటెస్ట్ బ్లూపంక్ట్ 4K స్మార్ట్ టీవీ గరిష్టంగా 60W  హెవీ సౌండ్ అవుట్ పుట్ అందించే శక్తితో వచ్చింది. అంతేకాదు, ఇది Dolby Digital Plus సౌండ్ టెక్నాలజీతో మంచి ఆడియో అనుభవాన్ని అందించగలదని కంపెనీ వెల్లడించింది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నా కూడా ఈ స్మార్ట్ టీవీ ధర మాత్రం 40 వేల రూపాయల కంటే తక్కువగానే సెట్ చెయ్యడం విశేషం. అందుకే, బ్లూపంక్ట్ 4K స్మార్ట్ టీవీ గురించి పూర్తిగా తెలుసుకుందామా..!

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Blaupunkt (50) inch 4K UHD TV: ప్రైస్&స్పెక్స్

బ్లూపంక్ట్ కొత్తగా ఇండియన్ మర్కెట్లోకి విడుదల చేసిన Blaupunkt (50) inch 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ రూ.36,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో మార్కెట్లోకి ప్రవేశించింది. ఈరోజు నుండి లాంచ్ మరియు ఫ్లిప్ కార్ట్ సేల్ ఆఫర్లతో లభిస్తుంది. దీని బుకింగ్ ఈరోజు నుండి అంటే 6 ఆగస్టు 2021 నుండి ప్రారంభమవుతుంది. వినియోగదారులు దీనిని Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు

ఇక ఈ బ్లూపంక్ట్ (50) ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 50 ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ 10 OS తో పనిచేస్తుంది. ఈ టీవీని మేడ్ ఇన్ ఇండియా టీవీగా అందించడానికి ప్రముఖ టీవీ తయారీదారు సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) భాగస్వామ్యంతో తయారు చేయబడింది. ఈ టీవీ పూర్తిగా బెజెల్ లెస్ డిజైన్ తో అందించబడింది మరియు గరిష్టంగా 500 నైట్స్ బ్రైట్నెస్ ఇవ్వగలదు.

ఈ టీవీ ఇన్ బిల్ట్ క్రోమ్ క్యాస్ట్ ఎయిర్ ప్లే తో వస్తుంది మరియు అమెజాన్, Netflix వంటి 6,000 కంటే పైచిలుకు యాప్స్ కి మద్దతు ఇస్తుంది. ఈ టీవీ శక్తివంతమైన ప్రాసెసర్ కి జతగా 2జిబి ర్యం మరియు 8జిబి స్టోరేజ్ కలిగివుంది. ఇక సౌండ్ పరంగా ఈ లేటెస్ట్ బ్లూపంక్ట్ స్మార్ట్ టీవీ  చాలా శక్తివంతమైనది. ఎందుకంటే, ఈ టీవీ క్వాడ్ స్పీకర్ సెటప్ తో 60W హెవీ సౌండ్ అందించగలదు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo