సాధారణ FHD టీవీ రేటుకే 43 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్. ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈటీవీ ఈ రేటుకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ అయ్యింది మరియు ఆకట్టుకునే ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. మరి ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 4K QLED Smart Tv ఆఫర్?
acerpure ఇటీవల విడుదల చేసిన 43 ఇంచ్ 4K క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు 59% భారీ డిస్కౌంట్ అందించింది. ఈ డిస్కౌంట్ దెబ్బకి ఈ స్మార్ట్ టీవీ కేవలం 19,999 ధరకే సేల్ అవుతోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై చాలా బ్యాంక్ ఆఫర్లు కూడా అందించింది. అవేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్ మరియు క్రెడిట్ మరియు BOBCARD EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 18,499 రూపాయలకే లభిస్తుంది.
ఈ ఏసర్ ప్యూర్ బై ఏసర్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2GB ర్యామ్ తో పాటు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ డిజైన్ మరియు సన్నని అంచులు కలిగిన స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, స్క్రీన్ మిర్రరింగ్ మరియు ఈథర్నెట్ వంటి పోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్ వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరకు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.2 రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.